Venkateswarlu
Venkateswarlu
కొన్ని సార్లు మెడికల్ మెరాకిల్ లాంటి సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఓ యువకుడి గుండె ఒకే రోజు 6 సార్లు కొట్టుకోవటం మానేసింది. అయినా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా చెందిన అతుల్‌రావు అనే యువకుడు బ్రిటన్‌లోని లండన్‌లో ఓ మెడికల్ కాలేజీలో ప్రీ మెడికల్ డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
గత జులై 27వ తేదీన అతుల్ కాలేజీలో ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు వెంటనే స్పందించాడు. అతుల్‌కు సీపీఆర్ ఇచ్చాడు. తర్వాత తోటి విద్యార్థుల సాయంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం కారణంగా గుండెకు రక్తం సరఫరా ఆగిపోయిందని వైద్యులు తేల్చారు. దీని వల్ల కొన్ని గంటల వ్యవధిలో ఆరు సార్లు అతడికి గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వారు ఎంతో కష్టపడి అతుల్ ప్రాణాలను నిలిపారు.
దాదాపు రెండు వారాల తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తమ కుమారుడి ప్రాణాలు నిలిపిన ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ హాస్పిటల్‌ను అతుల్ తల్లిదండ్రులు సందర్శించారు. అక్కడి డాక్టర్లకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, వైద్య విద్యార్థి అతుల్ రావు గుండె 24 గంటల్లో 6 సార్లు ఆగిపోయినా.. వైద్యుల సహకారంతో బతికి బయటపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.