LTTE ప్రభాకరన్.. 14 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికి కూడా అతడి పేరు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురినని, తన పేరు ద్వారకా ప్రభాకరన్ అని చెప్పుకుంటూ 12 నిమిషాలు ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా శ్రీలంక ఉలిక్కిపడింది.
LTTE ప్రభాకరన్.. 14 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికి కూడా అతడి పేరు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురినని, తన పేరు ద్వారకా ప్రభాకరన్ అని చెప్పుకుంటూ 12 నిమిషాలు ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా శ్రీలంక ఉలిక్కిపడింది.
LTTE ప్రభాకరన్.. 14 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికి కూడా అతడి పేరు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రభాకరన్ బతికే ఉన్నాడని త్వరలోనే వస్తాడని ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి ప్రభాకరన్ కు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురినని, తన పేరు ద్వారకా ప్రభాకరన్ అని చెప్పుకుంటూ 12 నిమిషాలు ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా శ్రీలంక ఉలిక్కిపడింది. ఆ వీడియోలో ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చింది.
“ఏదో ఒక రోజు ఈలంను సందర్శించి.. ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇక ఎన్నో కష్టాలను, మోసాలను అధిగమించి ఇక్కడి వచ్చాను. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎల్టీటీని ఎదుర్కొనలేక ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల మద్ధతు తీసుకుంది. రాజకీయ అవసరాల కోసం భిన్నత్వంలో ఏకత్వం అని చెబుతూ.. లంక ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లంక పౌరులు శ్రీలంకలో ఉన్న పేదల పట్ల శ్రద్ద చూపాలి. తమిళ పోరాటం సింహళ పౌరులకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం” అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ద్వారకా ప్రభాకరన్.
అయితే ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ని ఉపయోగించి చేశారనే సమాచారం తనకు అందిందని శ్రీలంక ప్రభుత్వానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఆ వీడియోలో ఉన్నది ప్రభాకరన్ కుమార్తె ద్వారకా ప్రభాకరనే అని తమిళ విమోచన ఉద్యమనేత పి. నెడుమారన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.