iDreamPost
android-app
ios-app

కామాంధ తండ్రి.. తల్లితో కాపురం.. కూతురిపై కన్నేసి.. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 05, 2024 | 2:35 PM Updated Updated Nov 05, 2024 | 2:35 PM

సమాజంలో అక్రమసంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. దారుణం ఏంటంటే కన్న తండ్రి కూడా కూతుర్లని చెరబట్టాలని చూస్తున్నాడు. తల్లితో కాపురం చేస్తూ కూతురిపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు.

సమాజంలో అక్రమసంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. దారుణం ఏంటంటే కన్న తండ్రి కూడా కూతుర్లని చెరబట్టాలని చూస్తున్నాడు. తల్లితో కాపురం చేస్తూ కూతురిపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు.

  • Published Nov 05, 2024 | 2:35 PMUpdated Nov 05, 2024 | 2:35 PM
కామాంధ తండ్రి.. తల్లితో కాపురం.. కూతురిపై కన్నేసి.. చివరకు ఏం జరిగిందంటే?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కామాంధుడి అరాచకం కలకలం సృష్టించింది. జనగామాలో కామాంధ తండ్రి వ్యవహారం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నది. తండ్రిగా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి కాటేయాలని చూస్తున్నాడు. తండ్రిగా కూతురును ఓ అయ్యకిచ్చి పెళ్లి చేయాల్సిందిపోయి తన ఇళ్లాలిగా చేసుకోవాలని కుట్రపన్నుతున్నాడు. ఓ వైపు తల్లితో కాపురం చేస్తూనే మరోవైపు కూతురిపై కన్నేశాడు. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రఘునాథపల్లి మండలం బానాజీపేటకు చెందిన ఓ మహిళ 2007 నుంచి రాజేందర్ తో ప్రేమ పేరుతో సహజీవనం చేస్తున్నది.

వరుసకు అత్త కావడంతో ఆమెకు మాయమాటలు చెప్పి రాజేందర్ ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో కొంత కాలం సహజీవనం చేశాడు. ఆ తర్వాత పెళ్ళి చేసుకోవాలని రాజేందర్ ను నిలదీస్తే మొహం చాటేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తిని తీసుకొచ్చి వివాహం జరిపించాడు. 2009లో మరో వ్యక్తితో ఆ మహిళకు వివాహం జరిగింది. కానీ, ఆమెను కాపురం చేయనివ్వలేదు. ఆమె భర్తకు వీరి సహజీవనం విషయం చెప్పాడు. దీంతో వీరి అక్రమ సంబంధం తెలిసి ఆమె భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజేందర్ ఆ మహిళను సహజీవనం పేరుతో తీసుకెళ్లి పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టాడు. రాజేందర్ తో సహజీవనం చేసిన ఆ మహిళ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

ఈ మధ్యనే పెద్ద కూతురు టెన్త్ పూర్తి చేసింది. 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న రాజేందర్ పెద్ద కూతురును పెళ్లి చేసుకుంటానని వేధించసాగాడు. కన్న తండ్రే కాటేయాలని చూశాడు. దీంతో ఆ మహిళకు రాజేందర్ కు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు సహజీవనం చేసిన మహిళ తనకు అత్త అవుతుందని ఆమె కూతురు తనకు మరదలు అవుతుందని వావివరసలు మరిచి ప్రవర్తించాడు. పెళ్లి చేయకపోతే తల్లి పిల్లు ముగ్గుర్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అర్ధరాత్రి ఇంటి వద్దకు వచ్చి తలుపులు బాదుతూ వీరాంగం సృష్టిస్తున్నాడు. రాజేందర్ వేధింపులతో ఆ మహిళ, ఆమె కూతుర్లు భయంతో వణికిపోతున్నారు. రాజేందర్ ఆగడాలు ఎక్కువవడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కామాంధ తండ్రి వ్యవహారం వెలుగుచూసింది. అయితే పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించింది ఆ మహిళ. తనకు, పిల్లలకు రాజేందర్ నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటోంది. రాజేందర్ తో సహజీవనం చేసి తప్పు చేశానని అదే ఇప్పుడు తన పిల్లలకు శాపంగా మారిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. రాజేందర్ పెళ్లి చేసుకుంటానంటున్న విషయం తన కూతురుకు తెలియదని తెలిపింది.

ఈ విషయం గనక తన కూతురుకు తెలిస్తే సూసైడ్ చేసుకుంటుందని తమకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులను వేడుకుంటున్నది. సమాజంలో రోజు రోజుకు విసృంఖలత్వం ఎక్కువైపోతున్నది. కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. కన్న తండ్రే కూతురిపై కన్నేయడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని వేధించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి కన్న కూతురిపై కన్నేసి పెళ్లి చేసుకుంటానంటున్న తండ్రి వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom