iDreamPost
android-app
ios-app

వీడియో: అందమైన భార్య.. అతడికి అనుభవించే రాత లేదు! అర్ధరాత్రి జ్యోతిష్యునికి ఫోన్ చేసి!

  • Published May 04, 2024 | 12:07 PM Updated Updated May 04, 2024 | 12:08 PM

భార్యపై అత్యంత దారుణంగా కొట్టి.. హింసించి.. ఆమెను హత్య చేశాడు ఓ మాజీ మంత్రి. ఆ తర్వాత తాపీగా ఓ జ్యోతిష్యుడికి కాల్‌ చేసి ఆమె బతికే అవకాశం ఉందా అని ప్రశ్నించాడు. అతడు భార్యపై దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

భార్యపై అత్యంత దారుణంగా కొట్టి.. హింసించి.. ఆమెను హత్య చేశాడు ఓ మాజీ మంత్రి. ఆ తర్వాత తాపీగా ఓ జ్యోతిష్యుడికి కాల్‌ చేసి ఆమె బతికే అవకాశం ఉందా అని ప్రశ్నించాడు. అతడు భార్యపై దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published May 04, 2024 | 12:07 PMUpdated May 04, 2024 | 12:08 PM
వీడియో: అందమైన భార్య.. అతడికి అనుభవించే రాత లేదు! అర్ధరాత్రి జ్యోతిష్యునికి ఫోన్ చేసి!

ఆడవారికి విలువ ఇవ్వని.. ఇవ్వడానికి మనసు రాని పురుషాధిక్య సమాజంలో మనం బతుకుతున్నాం. మగాడికి తల్లి, చెల్లి మీద ప్రేమ, గౌరవం ఉంటాయేమో కానీ.. కట్టుకున్న భార్యపై ప్రేమ, అభిమానం సంగతి అటుంచితే.. కనీసం మనిషే అన్న సంగతి కూడా గుర్తించరు చాలా మంది. పైగా ఆమె జీవితాన్ని ఏదో ఉద్దరించడానికి వీరు వివాహం చేసుకున్నట్లు ఫీలయ్యే మగవాళ్లు సమాజంలో కోకొల్లలు. అలాంటి వారి దృష్టిలో భార్య అంటే తాము కొట్టినా, తిట్టినా పడి ఉండే బానిస. చివరకు ఎంతకు తెగిస్తారు అంటే ఆమె ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడరు. భార్యపై దారుణాలకు పాల్పడే వారిలో సామాన్యులు.. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు అనే తేడా ఉండదు. భార్యను హింసించే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు.

తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. మాజీ మంత్రి ఒకరు.. అత్యంత దారుణంగా తన భార్యపై దాడి చేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించాల్సింది పోయి.. జ్యోతిష్యుడికి కాల్‌ చేసి ఆమె బతికే ఉంటుందా లేదా అంటూ ప్రశ్నించాడు. సదరు మంత్రి భార్యపై దాడి చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Wife killed by Husband

ఓ మాజీ మంత్రి తన భార్యను అత్యంత దారుణంగా హింసించి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను మాజీ మంత్రి కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ దారుణం కజకిస్తాన్‌లో వెలుగు చూసింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కావడంతో ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఇక వివరాల విషయానికి వస్తే.. గత నవంబరులో మాజీ మంత్రి కుయాండిక్ బిషింబాయేవ్ భార్య సాల్తానాట్ నుకెనోవా (31) ఓ రెస్టారెంట్‌లో అనుమానాస్ప స్థితిలో మృతిచెందారు. కుయాండిక్ బంధువులకు సంబంధించిన ఆ రెస్టారెంట్‌లోనే మాజీ మంత్రి దంపతులు ఓ రోజంతా ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా రెస్టారెంట్‌లో దంపతులు ఉండగా రికార్డయిన సీసీటీవీ దృశ్యాలను కోర్టులో ప్రసారం చేశారు. సుమారు 8 గంటల నిడివి ఉన్న ఈ వీడియోలో కజికిస్థాన్ ఆర్ధిక శాక మాజీ మంత్రి కుయాండిక్.. భార్య సాల్తానాట్‌ను దారుణంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెపై పిడుగుద్దులు కురిపించి, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు కుయాండిక్‌. అతడి నుంచి తప్పించుకోడానికి టాయ్‌లెట్‌లోకి వెళ్లి దాక్కుంటే.. తలుపు బద్దలుకొట్టి మరీ.. బయటకు లాక్కొచ్చాడు. అత్యంత విచక్షణారహితంగా దాడిచేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ప్రాసిక్యూటర్ తెలిపారు.

Wife killed by Husband

భార్యను తీవ్రంగా హింసించి.. కొట్టి.. రక్తపు మడుగులో పడి ఉండేలా చేసిన కుయాండిక్‌.. ఓ జ్యోతిషుడికి ఫోన్ చేసి ఆమె బతికే ఉంటుందా అని ప్రశ్నించాడు. దాడి జరిగిన 12 గంటల తర్వాత అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె మెదడుకు తీవ్రగాయం కావడం వల్లే చనిపోయింది అని వెల్లడించాడరు. మాజీ మంత్రి చేసిన దాడిలో ఆమె ముక్కు ఎముక విరిగిపోగా.. ముఖం, తల, చేతులపై అనేక గాయాలున్నట్టు తేలింది. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన మాజీ మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఇవన్నీ నిరూపితమైతే అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

Wife killed by Husband

అయితే భార్యను అత్యంత దారుణంగా కొట్టి.. హత్య చేసిన ఈ కేసులో కుయాండిక్‌ దోషిగా నిర్దారణ అయినప్పటికి అతడికి శిక్ష పడదు అంటున్నారు ఆ దేశ ప్రజలు. కారణం మాజీ మంత్రికున్న ఆస్తి, వ్యాపారలావాదేవీల కారణంగా.. అతడు ఈ నేరం తప్పించుకునే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక, వరకట్న వేధింపుల కేసులో 2017లో అరెస్టయిన మాజీ మంత్రికి పదేళ్ల జైలు శిక్ష పడింది. అయినా సరే మూడేళ్లకే బయటకు వచ్చేశాడని గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీకి చెందని వాడు కావడంతో అతడిని ఎవరూ ఏం చేయలేరని జనాలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఘటన కజకిస్తాన్‌ను కుదిపేస్తుంది.