iDreamPost
android-app
ios-app

3 నెలలుగా బ్రిటన్ యువరాణి మిస్సింగ్… రాజ కుటుంబంలో ఏం జరుగుతోంది..?

  • Published Mar 17, 2024 | 5:57 PM Updated Updated Mar 17, 2024 | 5:57 PM

బ్రిటన్ రాజ కుటుంబంలో యువరాణి కొన్ని రోజుల నుండి కనిపించకపోవడంతో చర్చకు దారి తీసింది. ఆమె మిస్సింగ్ అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

బ్రిటన్ రాజ కుటుంబంలో యువరాణి కొన్ని రోజుల నుండి కనిపించకపోవడంతో చర్చకు దారి తీసింది. ఆమె మిస్సింగ్ అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Published Mar 17, 2024 | 5:57 PMUpdated Mar 17, 2024 | 5:57 PM
3 నెలలుగా బ్రిటన్ యువరాణి మిస్సింగ్… రాజ కుటుంబంలో ఏం జరుగుతోంది..?

బ్రిటన్ రాజు కుటుంబంలో ఏం జరుగుతోంది. 2022లో ప్రినెన్స్ ఎలిజిబెత్ -2 మరణించడంతో ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ రాజుగా గత ఏడాది పట్టాభిషిక్తుడయ్యాడు. అంతలోనే అతడు క్యాన్సర్ బారిన పడ్డారు. కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్ వ్యాధి నిర్దారణ అయ్యిందంటూ బకింగ్ హామ్ ప్యాలెస్ ఫిబ్రవరిలో ప్రకటించింది. అంతలో యువరాణి కేట్ మిడిల్టన్ కనిపించడం లేదంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆమె అదృశ్యంపై రోజుకో ప్రచారం ఊపందుకుంటుంది. ఉదర సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటి నుండి ఆమె బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆమె మిస్సింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ఆపరేషన్ చేయించుకుందని, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుందని, వెల్లడించింది రాజ కుటుంబం. అయినప్పటికీ.. ఊహాగాలకు చెక్ పడలేదు.

అయితే కొంత మంది యువరాణి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆమెకు శస్త్ర చికిత్స వికటించి.. కోమాలోకి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. ఇంతలో ఆమె అక్కడ పనిచేసే సీనియర్ సిబ్బంది కూడా కోలుకున్నాక ఆమె కనిపించలేదని చెబుతున్నారు. కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రకటించేంత వరకు కూడా ఆమెకు శస్త్ర చికిత్స అయిన విషయం కూడా వారికి తెలియకపోవడం గమానర్హం. ఆ ప్రకటన వెలువడ్డాకే.. సిబ్బందికి విషయం తెలిసింది. అప్పటి నుండి యువరాణిని మాట్లాడిన, చూసిన దాఖలాలు లేవు. దీంతో రూమర్లు ఊపందుకున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు రాజకుటుంబం మదర్స్ డే నాడు ఓ ఫోటో విడుదల చేయగా.. అది ఎడిటెడ్ అని తేలిపోవడంతో యువరాణి అదృశ్యంపై మరింత చర్చ నడుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు.

ఆపరేషన్ తర్వాత విడుదల చేసిన మార్ఫింగ్ ఫోటోలో ఆమెను చూసిన వారంతా.. ‘విచారంలో ఉన్న ప్రిన్సెస్ డయానా’తో పోలుస్తున్నారు. అదే సమయంలో ఆమె కాపురంలో కలహాలు ఉన్నాయని, అదీ కూడా ఓ మహిళ కారణంగా అని తెలుస్తోంది. అలాగే కుట్ర కోణం కూడా ఉందని కొందరు భావిస్తున్నారు. కాగా, అయితే ప్రిన్ చార్లెస్ 3, ఆయన భార్య క్వీన్ కెమిల్లా మాత్రమే ఆమెను కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చాలా గుమ్మ నంగా జరుగుతోందట. మొత్తానికి ఆమె ఈస్టర్ తర్వాత కెన్సింగ్టన్ ప్యాలెస్‌కు రానుందని రాజ కుటుంబం చెబుతోంది. త్వరలోనే ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేయాలని యోచనలో ఉంది ఆ కుటుంబం. అనంతరం ఆమె కూడా బహిరంగంగా కనిపించేందుకు ప్లాన్ చేస్తుందట కుటుంబం. అప్పుడు కానీ ఈ రూమర్లకు చెక్ పడదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss