iDreamPost
android-app
ios-app

ఈ జపనీస్ వ్యక్తి రోజులో అరగంట మాత్రమే పడుకుంటాడు.. 12 ఏళ్లుగా ఇదే తంతు

  • Published Sep 03, 2024 | 12:33 PM Updated Updated Sep 03, 2024 | 12:33 PM

Man Sleeps 30 Minutes: ఏ మనిషికైనా నిద్ర అనేది చాలా అవసరం. రోజంతా పని చేసి అలసిన శరీరానికి, మెదడుకి విశ్రాంతి అనేది అవసరం. అందుకే కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్ర పోవాలని నిపుణులు చెబుతారు. కానీ ఈ మనిషి మాత్రం రోజులో కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. అయినా గానీ ఆరోగ్యంగానే ఉంటున్నాడు.

Man Sleeps 30 Minutes: ఏ మనిషికైనా నిద్ర అనేది చాలా అవసరం. రోజంతా పని చేసి అలసిన శరీరానికి, మెదడుకి విశ్రాంతి అనేది అవసరం. అందుకే కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్ర పోవాలని నిపుణులు చెబుతారు. కానీ ఈ మనిషి మాత్రం రోజులో కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. అయినా గానీ ఆరోగ్యంగానే ఉంటున్నాడు.

  • Published Sep 03, 2024 | 12:33 PMUpdated Sep 03, 2024 | 12:33 PM
ఈ జపనీస్ వ్యక్తి రోజులో అరగంట మాత్రమే పడుకుంటాడు.. 12 ఏళ్లుగా ఇదే తంతు

యావరేజ్ గా ఒక మనిషి శరీరం కనీసం 6 నుంచి 8 గంటల నిద్రను కోరుకుంటుంది. సరైన ఆరోగ్యం కోసం కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే అది వ్యక్తిగత జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. రోజువారీ పని కూడా చేయడం కష్టమవుతుంది. అందుకే నిపుణులు కూడా 6 నుంచి 8 గంటలు ఖచ్చితమైన నిద్ర ఉండాలని చెబుతారు. దీని వల్ల మానసిక స్థితి, డైలీ చేయాల్సిన పనులు, ఆరోగ్యం అన్నీ బాగుంటాయని చెబుతున్నారు. కానీ ఇవేమీ పాటించకపోయినా కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటున్నాడు. కేవలం అరగంట మాత్రమే నిద్రపోతూ కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఒకటి రెండు రోజులు కాదు.. 12 ఏళ్లుగా రోజులో 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. అయినా గానీ చురుగ్గా, చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇదెలా సాధ్యం అంటే?   

జపాన్ కి చెందిన డైసుకే హోరి రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. ఇదే నిద్ర వ్యవధిని గత 12 ఏళ్లుగా అనుసరిస్తూ వస్తున్నాడు. ఇలా చేస్తే తన జీవితం రెట్టింపు అవుతుందని అంటున్నాడు. వెస్టర్న్ జపాన్ లోని హ్యోగో జిల్లాకు చెందిన 40 ఏళ్ల డైసుకే చెప్తున్నదేంటంటే.. కనిష్ట నిద్రకు తన శరీరాన్ని, మెదడుని ట్రైన్ చేశానని.. దీని వల్ల తన పని మరింత మెరుగవుతుందని చెబుతున్నాడు. తినడానికి ఒక గంట ముందు వ్యాయామం చేయడం గానీ కాఫీ తాగడం వల్ల గానీ నిద్ర మగతను దూరం చేసుకోవచ్చునని చెబుతున్నాడు. డైసుకే హోరీ ఒక పారిశ్రామికవేత్త. ఇతను నమ్మేది ఏంటంటే.. ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే కూడా తక్కువ సమయమే నిద్రపోయినా గానీ అది నాణ్యమైన నిద్ర అయి ఉండాలి అని.

దీని వల్ల చేసే పని మీద దృష్టి పెరుగుతుందని చెబుతున్నాడు. పని విషయంలో నిలకడ కలిగిన ఏకాగ్రత అనేది నాణ్యమైన నిద్ర నుంచే వస్తుంది. డాక్టర్లు, అగ్నిమాపక సిబ్బంది తక్కువ విశ్రాంతి సమయాలను కలిగి ఉంటారు.. కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని మీడియా అవుట్ లెట్ మీడియా తెలిపింది. అయితే డైసుకే హోరి చెప్పేవి నిజమేనా అని నిర్ధారించుకునేందుకు జపాన్ యోమియూరి టీవీ అతన్ని మూడు రోజుల పాటు క్లోజ్ గా అబ్జర్వ్ చేసింది. విల్ యు గో విత్ మీ అనే టైటిల్ తో ఒక రియాలిటీ షోని నిర్వహించింది. అయితే ఈ షోలో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు. కానీ ఉత్సాహంగానే లేచాడు.. టిఫిన్ చేశాడు.. పనికి వెళ్ళాడు.. జిమ్ కూడా చేశాడు.

తనలానే మిగతా వారు కూడా ఉండాలన్న ఉద్దేశంతో.. 2016లో జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్ ని స్థాపించాడు. నిద్ర, ఆరోగ్యం వంటి విషయాల మీద క్లాసులు చెబుతున్నాడు. ఇప్పటి వరకూ 2,100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని అల్ట్రా షార్ట్ స్లీపర్స్ గా మార్చాడు. ఇదిలా ఉంటే వియాత్నం దేశానికి చెందిన 80 ఏళ్ల థాయి ఎంగోస్ చెప్తున్న దాని ప్రకారం.. అతను 60 ఏళ్లుగా అసలు నిద్రపోలేదని. 1962లో జ్వరం వచ్చిన తర్వాత నిద్రపోయే సామర్ధ్యాన్ని కోల్పోయినట్లు చెప్పాడు. వివిధ చికిత్సలు చేయించుకున్నా, నిద్ర మాత్రలు వాడినా గానీ నిద్ర లేమి సమస్య అలానే ఉందని ఎంగోస్ వెల్లడించాడు. మొత్తానికి అయితే అసలు నిద్ర పోకుండా కూడా జీవించవచ్చునని ఎంగోస్, రోజులో అరగంట మాత్రమే పడుకుంటూ కూడా రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండవచ్చునని డైసుకే హోరి చెబుతున్నారు. గొప్ప గొప్పోళ్ళు అంతా తక్కువ సేపు నిద్రపోతారు. ఆ తక్కువ సేపే అయినా క్వాలిటీ నిద్ర ఉండేలా చూసుకుంటారు. అదన్నమాట విషయం.