iDreamPost

పిల్లని చూస్తాం.. పెళ్లి చేసుకోండిరా.. అక్కడ యువతకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

Govt Bumper Offer: పెళ్లిళ్లు చేసుకోండిరా బాబు.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండిరా బాబు.. అని అక్కడ ప్రభుత్వం ప్రజలను రిక్వస్ట్ చేస్తుంది. పెళ్ళి చేసుకోవడానికి భాగస్వామిని వెతికిపెడతాం అని కూడా చెబుతుంది. అసలు ప్రభుత్వానికి ఈ కర్మ ఎందుకొచ్చిందంటే?

Govt Bumper Offer: పెళ్లిళ్లు చేసుకోండిరా బాబు.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండిరా బాబు.. అని అక్కడ ప్రభుత్వం ప్రజలను రిక్వస్ట్ చేస్తుంది. పెళ్ళి చేసుకోవడానికి భాగస్వామిని వెతికిపెడతాం అని కూడా చెబుతుంది. అసలు ప్రభుత్వానికి ఈ కర్మ ఎందుకొచ్చిందంటే?

పిల్లని చూస్తాం.. పెళ్లి చేసుకోండిరా.. అక్కడ యువతకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

పెళ్లి చేసుకోండి.. ఆ తర్వాత పిల్లల్ని కనండి.. మాకు సంతోషాన్నివ్వండి అని అక్కడి ప్రభుత్వం యువతను వేడుకుంటుంది. అంతేకాదు వాళ్ళని ప్రోత్సహించేలా డేటింగ్ యాప్ ని కూడా తీసుకొస్తుంది. సాధారణంగా డేటింగ్ యాప్స్ ని ప్రభుత్వాలు సపోర్ట్ చేయవు. దీని వల్ల మేలు కంటే కూడా కీడు జరుగుతుందని ఒక అభిప్రాయం ఉంది. డేటింగ్ పేరుతో స్కామ్ లకి పాల్పడతారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవేమీ లెక్కచేయని ప్రభుత్వం ఏకంగా డేటింగ్ యాప్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అక్కడి ప్రజలకు డేటింగ్ యాప్ అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వమే దగ్గరుండి మరీ ఈ డేటింగ్ యాప్ ని లాంఛ్ చేయాలని భావిస్తుంది.

జపాన్ రాజధాని టోక్యో ఒక డేటింగ్ యాప్ తీసుకురానుందని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ డేటింగ్ యాప్ లో చేరాలంటే వినియోగదారులు కొన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తాము సింగిల్ అని నిర్ధారించే డాక్యుమెంట్, పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నామని సంతకాలు పెట్టిన లేఖను జత చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు వార్షిక వేతనాన్ని నిర్ధారించే ట్యాక్స్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. సాధారణంగా ఇలాంటి డేటింగ్ యాప్స్ ని ప్రభుత్వాలు తీసుకురావడం అనేది అరుదు. కానీ జపాన్ లో జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా జపాన్ లో జననాల రేటు క్షీణిస్తూ వస్తుంది.

2023లో మరీ దారుణంగా పడిపోయింది. అధికారిక లెక్కలు ప్రకారం.. పుట్టేవారి కంటే కూడా మరణించే వారి సంఖ్య రెట్టింపుగా ఉంది. జననాల రేటు గత ఏడాదితో పోలిస్తే 5.1 శాతానికి పడిపోయి.. 7,58,631కి చేరుకుంది. ఇక వివాహాల సంఖ్య 90 ఏళ్ల కాలంలో తొలిసారిగా 5 లక్షల దిగువకు పడిపోయింది. గత ఏడాదిలో జపాన్ లో 4,89,281 మంది మాత్రమే వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకునేవారు తగ్గిపోవడంతో అక్కడి దేశ జనాభాపై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన ఆ దేశ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. జననాల రేటు క్షీణించడం అనేది తమ దేశం ఎదుర్కుంటున్న సంక్షోభం అని.. ఇలానే కొనసాగితే 2070 నాటికి జనాభా 30 శాతానికి పడిపోయి 87 మిలియన్లకు పడిపోతుందని అంచనా వేశారు. అంటే 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా.

అంతేకాదు అప్పటికి ప్రతి 10 మందిలో నలుగురు 65 ఏళ్ల వయసు లేదా ఆపైబడిన వారే ఉంటారని.. దీని వల్ల జపాన్ దేశం ప్రపంచమ్యాప్ నుంచి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువతీయువకులకు పెళ్లిపై ఇష్టం పెరిగేలా డేటింగ్ యాప్ ని తీసుకొస్తుంది. ఈ యాప్ ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకుని.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే జననాల రేటు పెరుగుతుందని.. ఇది దేశానికే ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

పెళ్లి చేసుకోవాలనుకునేవారిలో 70 శాతం మంది భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఎలాంటి యాప్స్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదని.. వారు సరైన భాగస్వామిని ఎంచుకునేందుకు ఈ డేటింగ్ యాప్ సహాయపడుతుందని ఒక అధికారి వెల్లడించారు. కాగా ఈ డేటింగ్ యాప్ పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జననాల రేటు వృద్ధి అంశం ప్రాముఖ్యతను జపాన్ ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే జపాన్ లాంటి దేశాలు అదృశ్యమవుతాయని అన్నారు. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందని.. నాగరికత క్షీణించడాన్ని చూస్తూ ఉండలేమని మస్క్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి