iDreamPost
android-app
ios-app

ఈ నగరం రోజురోజుకీ నీటిలో మునిగిపోతుంది! ఇది ప్రపంచాన్ని వణికించే సమస్య!

Jakarta Is Sinking: ఉష్ణోగ్రతల ప్రభావం కారణంగా మంచు కొండలు కరిగి అనేక ప్రాంతాలు నీట మునిగియి. అలానే చాలా ప్రాంతాలు నీట మునిగే దశలో ఉన్నాయి. అలానే ఓ దేశ రాజధాని కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది. మరి.. ఆ వివరాలు..

Jakarta Is Sinking: ఉష్ణోగ్రతల ప్రభావం కారణంగా మంచు కొండలు కరిగి అనేక ప్రాంతాలు నీట మునిగియి. అలానే చాలా ప్రాంతాలు నీట మునిగే దశలో ఉన్నాయి. అలానే ఓ దేశ రాజధాని కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది. మరి.. ఆ వివరాలు..

ఈ నగరం రోజురోజుకీ నీటిలో మునిగిపోతుంది! ఇది ప్రపంచాన్ని వణికించే సమస్య!

ప్రపంచం వ్యాప్తంగా  చాలా దేశాలు ఏదో ఒక సమస్యతో నిత్యం పోరాడుతుంటాయి. కొన్ని దేశాలు పేదరికం సమస్య, మరికొన్ని ఆర్థిక సమస్య, ఉగ్రవాద సమస్య వంటి వాడితో పోరాడుతుంటాయి. మరికొన్ని దేశాల్లో అంతర్గత భద్రత ప్రమాదంలో పడుతుంది. నీటికొరతతో అల్లాడిపోయే దేశాలు మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే..ఏదో ఒక దేశం, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. కానీ వీటన్నిటికి భిన్నం ఇండోనేషియాలోని ఓ నగరం వింత సమస్యను ఎదుర్కొంటుంది. ఇంకా చెప్పాలంటే..మరికొన్నేళ్లలో జలసమాధి కాబోతుంది. ఇంతకీ ఆ నగరం ఏమిటి, ఆ సమస్య ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈ భూ గ్రహం మీద భూభాగం కంటే నీరు ఎక్కువగా ఉంది. అలానే మహాసముద్రాల్లో పెద్ద పెద్ద మంచుకొండలు ఉంటున్నాయి. ఇవ్వన్నీ రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కరిగిపోతున్నాయి. ఇదే సమయంలో సముద్ర తీరంలో ఉండే నగరాలు కొంచెం కొంచెంగా మునిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు సముద్రంలో కలిసిపోయాయి. తాజాగా అలాంటి పరిస్థితిలో ఏకంగా ఇండోనేషియా రాజధాని ఉంది ఉంది. ఈ నగరంలో నివసించే ప్రజల కాళ్ల కింద భూమి ఏటా 25 సెంటీమీటర్ల చొప్పున నెమ్మదిగా కుంగిపోతుంది. అలానే ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలు చాలా వేగంగా సముద్రంలో మునిగిపోతున్నాయి. అలా మునిగిపోకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికి పరిష్కారం కావడంలేదు. అలానే ప్రస్తుతం జకార్తాలోని దాదాపు 10.6 మిలియన్ల ఇళ్లు సముద్రం లోపల కలిసిపోయే దశలో ఉన్నాయి. అంతేకాక  రోజు రోజుకు ఈ సమస్య బాగా పెరుగుతుంది.

దీంతో ఇండోనేషియా ప్రభుత్వం ఏకంగా రాజధానిని మార్చే ప్రయత్నం చేస్తోంది. జగర్తా నుంచి నుసంతారాకు రాజధానిని తరలించాలని చూస్తుంది. ఈ నగరంలో సముద్రానికి 1400 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక జకార్తా విషయానికి వస్తే.. గత పదేళ్లలో రెండున్నర మీటర్ల మేర ఈ నగరంలోని కొంత భూమి సముద్రంలో మునిగిపోయింది. ఈ నగరం మధ్యలోని 13 నదులు ఉద్భవించాయి. ఇండోనేషియాలోని ‘బాండూంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ అనే టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ 20 ఏళ్లుగా జకార్తా నగరంలో జరుగుతున్న మార్పులపై అధ్యయనం చేశాయి. ఈ సమస్య జకార్తాకు మాత్రమే పరిమితం కాదని.. సెమరాంగ్ (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), యోకోహామా (జపాన్), మెక్సికో నగరాలు కూడా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

జకార్తాను సముద్రంలో మునిగిపోకుండా కాపాడే అవకాశం లేదు కాబట్టి రాజధాని మార్పులే అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఇండోనేషియా కంటే ముందే బ్రెజిల్, నైజీరియా వంటి దేశాలు తమ రాజధానులను మార్చుకున్న సంగతి తెలిసిందే. జకార్తా నగరం విషయంలో మాత్రం ప్రకృతి సంక్షోభమే ప్రధాన కారణం. సముద్ర నీటిమట్టం పెరగడం వెనుక భూగర్భ జలాలు విపరీతంగా దోచుకోవడమే కారణమని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా కొన్నేళ్ల తరువాత నీట మునిగిన నగరాల జాబితాలో జకార్తా చేరనుంది.