iDreamPost
android-app
ios-app

జేబులో తుపాకీ పెట్టుకుని వార్తలు చదువుతున్న యాంకర్!

ఈ మధ్యకాలంలో పలు దేశాల్లో గన్ కల్చర్ బాగా పెరిగి పోయింది. వీటి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆత్మరక్షణ కోసం వినియోగిస్తున్నారు. తాజాగా బులెటిన్ చదువుతున్న సమయంలో ఓ మహిళ యాంకర్ జేబులో తుపాకీ కనిపించింది.

ఈ మధ్యకాలంలో పలు దేశాల్లో గన్ కల్చర్ బాగా పెరిగి పోయింది. వీటి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆత్మరక్షణ కోసం వినియోగిస్తున్నారు. తాజాగా బులెటిన్ చదువుతున్న సమయంలో ఓ మహిళ యాంకర్ జేబులో తుపాకీ కనిపించింది.

జేబులో తుపాకీ పెట్టుకుని వార్తలు చదువుతున్న యాంకర్!

సాధారణంగా న్యూస్ రీడర్స్, యాంకర్స్  వార్తలను ప్రజలకు చేరవేస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వార్తలను, ఇతర ఘటనలను టీవీ ఛానల్స్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తుంటారు. ఇలా న్యూస్ ను ప్రజలకు అందించడంలో న్యూస్ రీడర్స్, యాంకర్స్ ది కీలక పాత్ర. అంతేకాక స్టూడియోల్లో కూర్చుకుని వివిధ అంశాలపై చర్చలు కూడా జరుపుతుంటారు. అలా మనకు కనిపించే యాంకర్స్ చేతిలో పెను లేదా పేపర్లు వంటివి మాత్రమే కనిపిస్తాయి. కానీ ఓ మహిళా యాంకర్ ఏకంగా తుపాకితో కనిపించింది. ప్రస్తుతం సదరు మహిళకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

ప్రస్తుతం ఇజ్రాయోల్ క హమాస్ కి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల నుంచి ఈ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం హమాస్ తొలుత ఇజ్రాయాల్ పై దాడి చేసి.. ఆ దేశానికి చెందిన చాలా మందిని బదీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఈ రెండిటి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇక హమాస్ చేసిన పనికి ఇజ్రాయోల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. నేటికి గాజాపై  ఇజ్రాయోల్ సైన్యం విరుచకపడుతుంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా వేలాది మంది మరణించారు. రెండు ప్రాంతాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ పోరు ఇంకా కొనసాగుతుంది.

News reporters in Israel

ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కి చెందిన ఓ టీవీ యాంకర్ సోషల్ మీడియాలో నిలిచారు. ఇజ్రాయెల్ కి చెందిన ఆ లేడీ యాంకర్ ప్యాంటు వెనుక జేబులో తుపాకీ పెట్టుకుని ఉంది. అలానే గన్ ని తన వెనుక పాకెట్ లో పెట్టుకుని  వార్తలు చదువుతున్న ఫోటో వైరల్ గా మారింది. లిటల్ పిమేష్ అనే మహిళ  ఛానెల్ 14లో యాంకర్ గా పని చేస్తున్నారు. గతంలో 2002 నుంచి 2005 వరకు ఆమె దేశ సైన్యంలోనూ పని చేశారు. గత ఏడాది ఇజ్రాయెల్ పై జరిగిన దాడి, ప్రస్తుతం హమాస్ తో  యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ లో పలువురు మహిళలు తమ వెంట తుపాకులు తీసుకెళ్తున్నారు.

ఎక్కడైన ఉగ్రవాదులు తమపై దాడి చేస్తే.. ఆత్మరక్షణ కోసం ఇజ్రాయోల్ మహిళలు గన్స్ ను తమ వెంట క్యారీ చేస్తున్నారు. అదే తరహాలో లిటల్ కూడా తుపాకీ వెంట ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కాలంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది.  మాములు వస్తువులు కొనుగోలు చేసినట్లే గన్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ గన్ కల్చర్ కారణంగా ఎంతో మంది బలయ్యారు. ఇటీవలే కేవలం వారం వ్యవధిలో  నాలుగు వందల మంది బలయ్యారు. ఈనేపథ్యంలోనే యాంకర్ జేబులో తుపాకి ఉండటం తెగ వైరల్ గా మారింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.