iDreamPost
android-app
ios-app

బాలికల కనీస పెళ్లి వయస్సు 9 ఏళ్లు! ఇరాక్ పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు..

Iraq News: పెళ్లి విషయంలో అమ్మాయిల, అబ్బాయిల కనీస వయస్సు ను అనేది ఉంటుంది. ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు నిర్ణయించిన వయస్సు నిండిన యువతి యువకులు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు. తాజాగా అమ్మాయిల కనీస పెళ్లి వయస్సు 9 ఏళ్లకు తగ్గించేందుకు సిద్ధమైంది.

Iraq News: పెళ్లి విషయంలో అమ్మాయిల, అబ్బాయిల కనీస వయస్సు ను అనేది ఉంటుంది. ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు నిర్ణయించిన వయస్సు నిండిన యువతి యువకులు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు. తాజాగా అమ్మాయిల కనీస పెళ్లి వయస్సు 9 ఏళ్లకు తగ్గించేందుకు సిద్ధమైంది.

బాలికల కనీస పెళ్లి వయస్సు 9 ఏళ్లు!  ఇరాక్ పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు..

వివాహల విషయంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఉంటుంది. ఆయా దేశాల్లో అమ్మాయిల, అబ్బాయిల కనీస  పెళ్లి వయస్సు ను అనేది ఉంటుంది. అలా ప్రభుత్వం నిర్ణయించిన వయస్సు నిండిన యువతి యువకులు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు. అలా కానీ పక్షంలో బాల్య వివాహం కింద కేసులు ఎదుర్కొంటారు. ఇది ఇలా ఉంటే.. ఈ వివాహ కనీసపు వయస్సులో ప్రభుత్వాలు మార్పులు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ ప్రభుత్వం అమ్మాయి కనీస పెళ్లి వయస్సు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లే ఆమోదం పొందితే.. అక్కడ బాలికల కనీస పెళ్లి వయస్సు తొమ్మిదేళ్లు కానుంది. మరి.. ఆ దేశం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గల్ఫ్ దేశాల్లో ప్రధానమైన వాటిల్లో ఇరాక్ ఒకటి. ఇక్కడ ఉండే నిబంధనలు చాలా దారుణంగా ఉంటాయి. అంతేకాక ఈ దేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సంచలనంగా ఉంటాయి. తాజాగా ఇరాక్ ప్రభుత్వం అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ప్రతిపాదిత బిల్లును ఆ దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 18 ఏళ్లుగా అక్కడ బాలిక కనీస వివాహ వయసు  ఉంది. ఆ చట్టంలో సవరణలను చేస్తూ తాజాగా ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్‌ కు ప్రతిపాదించారు.

Minimum marriage age for girls is 9 years!

ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుపై సర్వత్రా నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ బిల్లు ఆమోదం పొందినట్లు అయితే.. కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేకుంటే కోర్టులు..వీటిల్లో దేనినైనా ఎంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల పోషణ విషయాల్లో హక్కులను మాత్రం ఈ బిల్లు హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. అదే విధంగా ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఆదేశంలో అమ్మాయిల కనీస పెళ్లి వయస్సు 9 ఏళ్లు, అలాగే అబ్బాయిలకు 15గా మారనుంది. తాజాగా ఇరాక్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ బిల్లు కారణంగా బాల్య వివాహాలు, లైంగిక దోపిడీలు పెరుగుతాయనే ఆందోళనకు వ్యక్తమవుతున్నాయి. అలానే లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లును మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే బాలిలకు సంబంధించిన అన్నీ విషయాల్లో తీవ్రమైన ప్రతికూలతకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. యూనిసెఫ్ లెక్కల ప్రకారం.. ఇరాక్ లో ఇప్పటికే 28 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహలు జరుగుతున్నాయి. గతంలోను ఇరాక్ పార్లమెంట్ లో వివాహ వయసు కుదింపు ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో పలువురు చట్టసభ సభ్యులు అభ్యతంరం చెప్పడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఇరాక్ ప్రభుత్వం