nagidream
Want To Be Viral On Insta: ఇన్ స్టాలో మీరు పెట్టిన వీడియో వైరల్ అవ్వాలా? అయితే రెండు వారాల పాటు ఇలా చేయండి. ఇన్ స్టా సీఈఓ చెప్పినట్టు చేస్తే రెండు వారాల్లో మీరు వైరల్ అవుతారు. మరి ఆయన ఏం చెప్పారో పూర్తి కథనంలో చూసేయండి.
Want To Be Viral On Insta: ఇన్ స్టాలో మీరు పెట్టిన వీడియో వైరల్ అవ్వాలా? అయితే రెండు వారాల పాటు ఇలా చేయండి. ఇన్ స్టా సీఈఓ చెప్పినట్టు చేస్తే రెండు వారాల్లో మీరు వైరల్ అవుతారు. మరి ఆయన ఏం చెప్పారో పూర్తి కథనంలో చూసేయండి.
nagidream
ఒకప్పుడు డబ్బులు సంపాదించుకోవాలంటే యూట్యూబ్ మాత్రమే మార్గంగా ఉండేది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాలంటే పేజ్ మానిటైజ్ అయి ఉండాలి. అది జరగాలంటే ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉండాలి. అదే సమయంలో పేజ్ కి రీచ్ ఎక్కువ ఉండాలి. అది జరగాలంటే వీడియో వైరల్ అవ్వాలి. మరి వీడియో వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్.. ఇన్ స్టాగ్రామ్ సీఈఓ చెప్పిన టిప్ ని పాటిస్తే చాలు. మరి ఆయన ఏం చెప్పారో చూద్దాం.
ఇన్ స్టాగ్రామ్ లో కుప్పలు తెప్పలుగా పోస్ట్ లు పెడుతుంటారు. కానీ ఎన్ని పెట్టినా రీచ్ మాత్రం రాదు. ఒక్క వీడియో వైరల్ అయితే బాగుణ్ణు అని అనుకుంటారు. అయితే ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. యూజర్స్ కి ఏం కావాలి? ఏం ఇవ్వాలి? అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని వీడియోలు పెట్టినా, ఎన్ని పోస్టులు పెట్టినా రీచ్ రావడం లేదని.. వైరల్ అవ్వడం లేదని బాధపడేవారి కోసం ఇన్ స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి కొన్ని టిప్స్ చెప్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే..?
మామూలుగా మనం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో లేదా వీడియో వైరల్ అవ్వాలని అనుకుంటాం. అయితే ఎక్కువ మందికి మన కంటెంట్ రీచ్ అవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలని ఆడమ్ అన్నారు. ఏదైనా వీడియో లేదా పోస్ట్ ని పోస్ట్ చేసి వదిలేయకుండా రెగ్యులర్ గా కామెంట్స్ ని పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. ఫాలోవర్లు, ఇతరులు మనం అప్లోడ్ చేసిన కంటెంట్ మీద విలువైన కామెంట్స్ చేస్తారు. అటువంటప్పుడు వారి ఆలోచనా విధానం ఎలా ఉందో అర్థం చేసుకుని దానికి తగ్గట్టు కంటెంట్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఫాలోవర్స్ కోరుకున్న కంటెంట్ ని ఇవ్వడానికి ప్రయత్నించాలని అన్నారు. వీడియో లేదా పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కనీసం రెండు వారాల పాటు కామెంట్లను ట్రాక్ చేయాలని.. వాటికి తగిన రిప్లైలు ఇవ్వాలని అన్నారు.