Krishna Kowshik
ఈ భూ ప్రపంచంపై ఎన్నో వింతలున్నాయి. అలాగే ప్రతి జీవిలోనూ ఓ స్పెషల్ లక్షణం ఉంటుంది. గుడ్లగూబకు తల మొత్తం తిప్పి చూసే గుణం ఉంటుంది. అలాగే ప్రతి చెట్టుకు, పుట్టకు, పురుగుకు కూడా స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అయితే...
ఈ భూ ప్రపంచంపై ఎన్నో వింతలున్నాయి. అలాగే ప్రతి జీవిలోనూ ఓ స్పెషల్ లక్షణం ఉంటుంది. గుడ్లగూబకు తల మొత్తం తిప్పి చూసే గుణం ఉంటుంది. అలాగే ప్రతి చెట్టుకు, పుట్టకు, పురుగుకు కూడా స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అయితే...
Krishna Kowshik
ఈ భూ మండలంపై ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. చెట్టు, పుట్ట దగ్గర నుండి పశు పక్షాదులు, కీటకాల వరకు ఎన్నో జీవాలు నివసిస్తున్నాయి. అయితే కొన్ని పక్షులకు, జంతువులు, కీటకాలకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్కో మనిషికి ఒక్కో నైజం ఉన్నట్లు.. ప్రతి ప్రాణిలో కనిపించే, కనిపించని కొన్ని గుణాలు ఉంటాయి. ‘చెరువులోని చేపకెవరు ఈత నేర్పిరి?, బావిలోని కప్పకెవరు బాస నేర్పిరి?, అడవిలోని హంసకెవరు ఆట నేర్పిరి? చెట్టుమీద కోకిలకు ఎవరు పాట నేర్పిరి..? పుట్టలోని పాముకెవరు బుసలు నేర్పిరి..? ఆ పుట్టిన బాలుడుకు ఏడ్పు నేర్పిరి’ అంటూ కుమారీ ఆంటీ చెప్పినట్లు.. ఓ ప్రాణికి ఒక్కో లక్షణం ఉంటుంది. అలాగే స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడో మీకే వింత కీటకం గురించి చెబుతాను..కాదు కాదు తెలుసుకుందాం.
ఇదిగో ఇప్పుడు ఈ కింద పేర్కొన్న వీడియోను చూడండి. అందులో వాన పడుతుంటే.. కింద నడుస్తున్న ప్రజలు గొడుగులు వేసుకుని వెళుతున్నారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా..? వాన పడితే నచ్చితే తడుస్తారు. తడవకూడదు అనుకుంటే గొడుగులు వేసుకుంటారు అని అనుకుంటారేమో.. కానీ మీకు తెలియని విషయమేమిటంటే.. అది రియల్ వాన కాదు.. కీటకాలు చేస్తున్న మూత్ర విసర్జన. వినడానికి వింతగా ఉంది కదా. యాక్ అది మూత్రమా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారా..? అది ముమ్మాటికి కీటకం పనే. ఇది పురుగు చేస్తున్న మూత్ర విసర్జనే. ఇంతకు ఈ కీటకం ఏ ప్రాంతానికి చెందినది అంటే చైనా. చైనాలోని జియామెన్ విశ్వవిద్యాలయంలో ఈ దృశ్యం వెలుగు చూసింది.
ఈ కీటకాలను చేసే పని తట్టుకోలేక.. ఆ ప్రాంగణంలో గొడుగులు తీసుకొని వెళతారు. మరీ ఈ కీటకాలు ఆ ద్రావణాన్ని ఎలా తీసుకుంటాయో తెలుసా.? చెట్ల నుండి తాగే రసాన్ని స్రవించి మూత్ర విసర్జన చేస్తాయి. చెట్లను ఆనవాలుగా చేసుకున్న ఈ కీటకాలకు ప్రధాన ఆహారం.. చెట్లలో రసం. తాగిన ఆ కొంచెం నీటినే తిరిగి వదిలేస్తుంటాయి. అందుకే చైనీయులు.. ఈ కీటకాలు సంచరించే చోట..గొడుగులు వేసుకుని తిరగాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ పురుగు విసర్జించడం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ వీడియోను చూసి నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కీటకాలు ఏ జాతికి చెందినవి అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు సోషల్ మీడియా సైనికులు.