iDreamPost
android-app
ios-app

వీడియో: పుట్ పాత్‌పై నడుస్తుండగా.. మ్యాన్ హోల్ కుంగి..మహిళ గల్లంతు!

Indian woman falls into sinkhole in Malaysia: జీవనోపాధి కోసం దేశం కానీ దేశం వెళ్లిన మహిళ.. పుట్ పాత్ పై నడవడే పాపంగా మారింది. మ్యాన్ హోల్ రూపంలో వచ్చిన మృత్యువు...ఆమెను బలి తీసుకుంది.

Indian woman falls into sinkhole in Malaysia: జీవనోపాధి కోసం దేశం కానీ దేశం వెళ్లిన మహిళ.. పుట్ పాత్ పై నడవడే పాపంగా మారింది. మ్యాన్ హోల్ రూపంలో వచ్చిన మృత్యువు...ఆమెను బలి తీసుకుంది.

వీడియో: పుట్ పాత్‌పై నడుస్తుండగా.. మ్యాన్ హోల్ కుంగి..మహిళ గల్లంతు!

మృత్యువు అనేది ఎప్పుడు  ఏ రూపంలో వస్తుందో ఎవరం చెప్పలేము. మనం నడుచుకుంటూ వెళ్తున్న మృత్యవు అనేది మన పాదాల కిందనే రావచ్చు. అలా విచిత్రమైన సంఘటనలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.  అయితే కొన్ని సార్లు ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతుంటారు. తాజాగా ఓ మహిళ పుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్లడమే నేరమైంది. అకస్మాత్తుగా మ్యాన్ హోల్ కుంగిపోయి.. మహిళ మృతి చెందింది. మలేసియాలో తెలుగు మహిళ ఈ  ఘోరానికి బలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలకు కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి (45) అనే మహిళ జీవనోపాధి కోసం మలేసియా వెళ్లింది. అక్కడ కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె తన భర్తతో కలిసి నగరంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటుంది. శుక్రవారం డాంగ్ వాంగి ప్రాంతంలో మహిళ కాలిబాటపై నడుచుకుంటూ వెళ్తుంది. ఇలా రోడ్డు పక్కన ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా..ఒక్కసారిగా మ్యాన్ హోల్ కుప్పకూలింది. దీంతో 26 అడుగుల లోతులోకి వెళ్లిపోయి గల్లంతైంది. మ్యాన్ హోల్  లో పడిన ఆ మహిళ మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

అయితే ప్రస్తుతం మృతదేహం  గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి  చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కుంగిపోయిన మ్యాన్ హోల్ శిధిలాలను తొలగించడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. చాలా వరకు శిధిలాలను తొలగించినా మహిళ జాడ లేదు. ఈ సంఘటనకు గల కారణాలపై వ్యాఖ్యానించడానికి స్థానిక పోలీసులు నిరాకరించారు. ఆమె గల్లంతు కావడంతో.. బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక ఈమెకు మ్యాన్ హోల్ లో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలానే సౌదీ అరేబియాకు వెళ్లిన తెలంగాణ యువకుడు ఎడారిలో తప్పిపోయి..నాలుగు రోజుల తరువాత మరణించాడు. జీపీఎస్ పని చేయకపోవడం, కారులో పెట్రోల్ అయిపోవడంతో ఎడారి మధ్యలో చిక్కుకుని..డీహైడ్రేషన్ కి గురై.. ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. అతడి తో పాటు ఉన్న సహచర ఉద్యోగి కూడా మరణించాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు ఉపాధి కోసం సౌదీ వెళ్లి..మృతి చెందాడు. తాజాగా మలేసియాలో ఈ మహిళ మరణించారు. మరి..ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.