iDreamPost
android-app
ios-app

నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు.. అంతరిక్షంలోకి స్నేక్ రోబో..!

  • Published Nov 16, 2023 | 10:13 AM Updated Updated Nov 16, 2023 | 10:13 AM

ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానంతో మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నాడు. అంతరిక్షంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ తనదైన మార్క్ చాటుకున్నాడు.

ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానంతో మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నాడు. అంతరిక్షంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ తనదైన మార్క్ చాటుకున్నాడు.

  • Published Nov 16, 2023 | 10:13 AMUpdated Nov 16, 2023 | 10:13 AM
నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు.. అంతరిక్షంలోకి స్నేక్ రోబో..!

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనిషి ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. ఒకప్పుడు వంద మంది చేసే పని ఒక్క మిషన్ చేసే స్థాయికి వచ్చింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎన్నో విప్లావాత్మకం మార్పులు సంభవించాయి. భూమి, ఆకాశం, సముద్రం అన్ని ప్రదేశాల్లో మనిషి తన మేధస్సుతో ఎన్నో పరిశోధనలు చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. రహస్యాలను ఛేదిస్తున్నాడు. ఒకప్పుడు జాబిల్లిని ఆకాశంలో చూసి మురిసిపోయేవాళ్లు.. ఇప్పుడు జాబిల్లిపై అడుగు పెట్టి పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత సంతతికి చెందిన ఎంతోమంది ప్రతిభావంతులు విదేశాల్లో ఎన్నో అద్భుతాలు సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ సరికొత్త రోబోని ఆవిష్కరించింది.. దీని వెనుక ఓ భారతీ కుర్రాడి మేధస్సు దాగి ఉంది. వివరాల్లోకి వెళితే..

చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టకు ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఒక రోబోను తయారు చేస్తున్నారు. అచ్చం పాములా ఉండే ఈ రోబో ఎలాంటి ప్రతికూల వాతావరణం అయినా తట్టుకునే సామర్ధ్యం కలిగి ఉండి.. ఎక్కడైనా ప్రయాణించగలదు. అయితే ఈ అద్భుతమైన ఆవిష్కరణ భారత సంతతికి చెందని ఓ యువ ఇంజనీర్ ఆలోచనతో అమెరికాలో కార్యరూపం దాల్చుతుంది. నాగర్ పూర్ కి చెందిన రోహణ్ టక్కర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని నాసాలో జెట్ ప్రొపల్షన్ లేబోరేటరి లో పనిచేస్తున్నాడు. ఎగ్జోబయోలజీ ఎక్స్ టంట్ లైఫ్ సర్వేయర్ పేరుతో ఈ స్నేక్ రూపంలో ఉండే రోబో ఆలోచన రోహణ్ టక్కర్ ది కావడం విశేషం. దీని ప్రత్యేకత ఏంటంటే.. కొండలు, గుహల్లోనూ సునాయాసంగా ఇది ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపై జీవం పుట్టుకను ఈ స్నేక్ రోబో అన్వేషించగలదు అంటున్నారు. అంతేకాదు విపత్తు నిర్వహణల్లోనూ ఇది చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇక ఈ అద్భుత అవిష్కణ రూపకర్త అయిన రోహణ్ టక్కర్ విషయానికి వస్తే.. నాగ్‌పూర్ లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తాను రూపొందించి రోబో గురించి రోహణ్ టక్కర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి నాకంటూ ఓ ప్రత్యేకత చాటుకోవాలనే ఆశ ఉండేది.. ఎన్నో రక రకాల వస్తువులు తయారు చేస్తూ నా ప్రతిభను నిరూపిస్తూ వచ్చాను.. ఎంతోమంది మంది నన్ను ప్రోత్సహించేవారు. నేను చేస్తున్న ఈ స్నేక్ రోబో విపత్తుల సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.. ఇది మంచు కొండలపై, గరుకు ప్రదేశాల్లో సైతం సునాయాసంగా ప్రయాణిస్తుంది. నాసా కోసం మార్షియన్ హెలికాప్టర్ ను రూపొందించిన ఐఐటీయన్ బాబ్ బలరాం నాకు స్ఫూర్తి.. ఐఐటీలో సీటు సాధించలేకపోయినా, నేను ఎంతో కష్టపడి నాసాలో ఉద్యోగం సంపాదించగలిగాను. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ – 3 మిషన్ సక్సెస్ భారతీయుల అద్భుత సృష్టి’ అని అన్నారు.