iDreamPost
android-app
ios-app

భారతీయ అమెరికన్‌ జంటకు 20 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

  • Published Jan 27, 2024 | 5:03 PM Updated Updated Jan 27, 2024 | 5:03 PM

Indian American Couple Jailed: డబ్బు వస్తుందని ఆశతో విదేశాలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడ్డవారు ఎంతోమంది ఉన్నారు. మంచి ఉపాధి, తగిన డబ్బు వస్తుందని వెళ్లి అక్కడ యజమానులు పెట్టే హింసలు భరించలేక కొంతమంది తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Indian American Couple Jailed: డబ్బు వస్తుందని ఆశతో విదేశాలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడ్డవారు ఎంతోమంది ఉన్నారు. మంచి ఉపాధి, తగిన డబ్బు వస్తుందని వెళ్లి అక్కడ యజమానులు పెట్టే హింసలు భరించలేక కొంతమంది తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

భారతీయ అమెరికన్‌ జంటకు 20 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

డబ్బు సంపాదన కోసం చాలా మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు.   అయితే విదేశాలకు వెళ్లిన వారు కొన్నిసార్లు తాము కోరుకున్న ఉద్యోగం లభించకపోగా.. అనవసర కష్టాల్లో పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాల్లో పనిచేసే వారి విషయంలో కఠిన నియమనిబంధనలు ఉంటాయి.. ఒకవేళ అవి మీరితే కఠిన శిక్షలు ఉంటాయి. చాలా మంది విదేశాల్లో వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి అతి కష్టం మీద స్వదేశాలకు వచ్చిన వారు ఉన్నారు. విదేశంలో ఉన్న ఓ జంట తమ బంధువును రప్పించి అక్కడ నానా కష్టాలు పెట్టారు.. దీనికి అక్కడి ప్రభుత్వం వారికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో భారతీయ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్స్ కోసం తెలిసిన బంధువును కార్మికునిగా నియమించుకున్నారు. అతనిచే కొన్ని పనులు బలవంతంగా చేయించుకున్న నేరం రుజువు కావడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖారారు చేయనున్నారు. అమెరికాలో హర్మత్ సింగ్ , కుల్బీర్ కౌర్ దంపతులు తమ దగ్గరి బంధువు చేత క్యాషియర్, కిచెన్ పనులు, స్టోర్ రికార్డులు, క్లీనింగ్ పనులు తో పాటు ఇతర పనులు బలవంతంగా చేయించారు. ఈ విషయంలో దంపతుల నేరం రుజువైంది. ఇటువంటి కేసుల్లో గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు 2,50,000 అమెరికన్ డాలర్లు జరిమానా కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ కేసు గురించి  అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ కార్క్ మాట్లాడుతూ.. బాధితుడు ఇక్కడికి విద్యాభ్యాసానికి వచ్చాడు. కానీ అతని ఆశలు మంటకలిపారు ఈ దంపతులు. బాధితుడిని మానసికంగా, శారీరకంగా వేధించారు. అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలు దాచి బెదిరింపులకు పాల్పపడ్డారు. కనీస జీతం కూడా చెల్లించకుండా అతని పట్ల దుశ్చర్యలకు పాల్పపడ్డారు అని పేర్కొన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల వాదనలో 2018 సంవత్సరంలో బాధితుడిని యునైటెడ్ స్టేట్స్‌లో పాఠశాలకు పంపుతామని చెప్పి యునైటెడ్ స్టేట్స్ కి తీసుకువచ్చారు. ఆ తర్వాత అతని వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్ పత్రాలు తీసుకొని నాటి నుంచి ఎన్నో రకాలుగా హింసలు పెడ్తూ వచ్చారు. బాధితుడు సెలవు అడిగితే రివాల్వర్ తో బెదిరించినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ జరిపిన తర్వాత అమెరికన్ జంటను దోషులుగా నిర్ధారించారు. గతంలో కూడా చాలా మంది అమాయకులను పనులు ఇప్పిస్తామని, చదివిస్తామని వాగ్దానాలు చేసి తమ వెంట తీసుకొని వెళ్లి పనులు చేయించుకొని నానా హింసలు పెట్టిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.