nagidream
ఇష్టంగా లేస్ చిప్స్ ని తింటున్నారా? పిల్లలకి చిప్స్ కొంటున్నారా? అయితే జాగ్రత్త.. లేస్ ప్యాకెట్ వెనకాల ఇంగ్రిడియంట్స్ లో ఏం రాసి ఉందో చూడండి. చిప్స్ తయారీలో ఏం వాడుతున్నారో? వాటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? హాని జరుగుతుందా? తెలుసుకోకపోతే ప్రమాదం తప్పదు.
ఇష్టంగా లేస్ చిప్స్ ని తింటున్నారా? పిల్లలకి చిప్స్ కొంటున్నారా? అయితే జాగ్రత్త.. లేస్ ప్యాకెట్ వెనకాల ఇంగ్రిడియంట్స్ లో ఏం రాసి ఉందో చూడండి. చిప్స్ తయారీలో ఏం వాడుతున్నారో? వాటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? హాని జరుగుతుందా? తెలుసుకోకపోతే ప్రమాదం తప్పదు.
nagidream
లేస్ చిప్స్ అనేవి మన దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి టేస్ట్ చేస్తే అడిక్ట్ అయిపోయేంత క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. అయితే ఇన్నాళ్లు మనం తిన్న లేస్ చిప్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయని మీకు తెలుసా? అవును మరి లేస్ చిప్స్ తయారు చేసే పెప్సికో కంపెనీ భారతీయులను లోకువ చూస్తే అనారోగ్య సమస్యలు రాక ఇంకేమవుతుంది. పెప్సికో కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉంది. ఈ కంపెనీ సాఫ్ట్ డ్రింక్ లు, చిప్స్ వంటి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేసి దేశవిదేశాల్లో విక్రయిస్తోంది. అయితే మన దేశం విషయానికొచ్చేసరికి లేస్ చిప్స్ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుంది.
ఇన్నాళ్లు మనం తిన్న చిప్స్ తయారీలో పెప్సికో కంపెనీ సన్ ఫ్లవర్ ఆయిల్ బదులు పామాయిల్ ని వాడేది. భారతదేశంలో తయారయ్యే లేస్ చిప్స్ ని పామాయిల్ తో చేసేవారు. అమెరికాలో సన్ ఫ్లవర్ ఆయిల్ లేదా కార్న్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్ తో లేస్ చిప్స్ ని తయారు చేస్తున్న కంపెనీ.. మన భారతదేశానికి వచ్చేసరికి లేస్ ప్యాకెట్స్ ని పామాయిల్ తో తయారు చేస్తుంది. ఈ పామాయిల్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పామాయిల్ తో చేసిన ఫుడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోయి గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. పామాయిల్ లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉన్నాయి. కానీ గుండె ఆరోగ్యానికి ఇది ప్రతికూలంగా పని చేస్తుంది. అందుకే పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాంటి నూనెను.. పెప్సికో కంపెనీ మన దేశంలో తయారయ్యే చిప్స్ తయారీ కోసం వాడుతుంది. అయితే రేవంత్ హిమత్ సింగ్క అనే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. భారతీయులకు పెప్సికో కంపెనీ చేస్తున్న మోసాన్ని వీడియో ద్వారా బయటపెట్టారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడంతో లేస్ చిప్స్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో దిగొచ్చిన పెప్సికో కంపెనీ.. పామాయిల్ బదులు మంచి నూనె వాడతామని చెప్పింది. పామాయిల్ బదులు సన్ ఫ్లవర్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ మిశ్రమాలతో చిప్స్ తయారు చేయడానికి ట్రయల్స్ ని నిర్వహిస్తుంది.
త్వరలోనే పామాయిల్ తో కాకుండా సన్ ఫ్లవర్ ఆయిల్ లేదా వేరే మంచి నూనెతో చేసిన చిప్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. ఈ దెబ్బతో చిప్స్ తయారు చేస్తే బింగో, హల్దీరామ్ వంటి కంపెనీలపై ఒత్తిడి పడుతుంది. దీంతో వాళ్ళు కూడా పామాయిల్ ని మార్చి మంచి నూనెను వాడతారు అంటూ రేవంత్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అయితే అప్పటి వరకూ లేస్ చిప్స్ ప్యాకెట్ వెనకాల ఇంగ్రిడియంట్స్ లో పామాయిల్ అని మెన్షన్ చేసి ఉంటే కొనకండి. లేదంటే మీ ఆరోగ్యం ఖల్లాస్ అంతే. మరి ఇన్నాళ్లు మన భారతీయుల విషయంలో కక్కుర్తి చూపించిన పెప్సికో సంస్థపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Big win! Lay’s India to reduce palm oil usage!
Last month, I made a video showcasing how Lay’s India uses palm oil but Lay’s USA does not use Palm oil!
After a lot of public pressure, Lays India has set a public statement that they have begun the process to replace palm oil in… pic.twitter.com/qAJOUdNxhV
— Revant Himatsingka “Food Pharmer” (@foodpharmer2) May 9, 2024