iDreamPost
android-app
ios-app

భార్య పుట్టినరోజు మర్చిపోవడం నేరం.. భర్తకు ఐదేళ్లు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

Forgets Wife's Birthday Is Crime: భార్య పుట్టినరోజు మర్చిపోవడం మనకి ఇక్కడ ఒక ఆర్టు. కానీ అక్కడ మాత్రం నేరం. క్షమించరాని నేరం. మర్చిపోతే జరిమానా వేస్తారు.. వాళ్ళ మూడ్ బాలేకపోతే జైల్లోకి కూడా తోస్తారు. అక్కడ భార్య డేటాఫ్ బర్త్ లని మర్చిపోయే ఆర్టిస్టులని తొక్కేస్తారు.

Forgets Wife's Birthday Is Crime: భార్య పుట్టినరోజు మర్చిపోవడం మనకి ఇక్కడ ఒక ఆర్టు. కానీ అక్కడ మాత్రం నేరం. క్షమించరాని నేరం. మర్చిపోతే జరిమానా వేస్తారు.. వాళ్ళ మూడ్ బాలేకపోతే జైల్లోకి కూడా తోస్తారు. అక్కడ భార్య డేటాఫ్ బర్త్ లని మర్చిపోయే ఆర్టిస్టులని తొక్కేస్తారు.

భార్య పుట్టినరోజు మర్చిపోవడం నేరం.. భర్తకు ఐదేళ్లు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా మనుషులకు మతిమరుపు ఎక్కువ. అందులోనూ మగాళ్ళకైతే మరీ ఎక్కువ. పెళ్ళైన మగాళ్ళకైతే ఆ మతిమరుపు పీక్స్ లో ఉంటుందంటారు. ఈ మతిమరుపు ప్రవాహంలోనే పెళ్లి రోజులు, భార్య పుట్టినరోజులు, ముఖ్యమైన తేదీలు అన్నీ కొట్టుకుపోతాయి. ఆ ముఖ్యమైన తేదీల్లో భార్యల బారిన పడ్డ భర్తల పరిస్థితి చూడాలి.. పెనం లోంచి పొయ్యి మీద పడ్డట్టే అవుతుంది. నా పుట్టినరోజు మర్చిపోతావా? అంటూ హస్బెండ్ బెండ్ తీసేస్తారు. ఒక మినీ సైజ్ మహాభారత యుద్ధమే జరుగుతుంది భార్యాభర్తల మధ్య. చాలా మంది భర్తలు తరచుగా తమ భార్యల పుట్టినరోజుని మర్చిపోతామని.. అది మా వీక్ నెస్ అని చెబుతారు. అయినా సరే భార్యలు గొడవ పడుతుంటారు. కొంతమంది సర్లే అని క్షమించేస్తారు. కొంతమంది గిఫ్ట్ పేరుతో భారీ పెనాల్టీ వేస్తారు ఆ భర్తకి.

కానీ చాలా సందర్భాల్లో.. చాలా చోట్ల భార్య పుట్టినరోజు మర్చిపోయినందుకు భర్తలే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది అనధికారికంగా, అనాధిగా కొనసాగుతున్న ప్రక్రియ. అయితే అధికారికంగా ఈ ప్రక్రియ ఒక చోట జరుగుతుంది. పైగా అక్కడ భార్య పుట్టినరోజు మర్చిపోవడం నేరం కూడా. భార్య పుట్టినరోజు మర్చిపోవడం ఇక్కడ మనకు నేరం కాకపోవచ్చు కానీ అక్కడ మాత్రం ఒక పెద్ద నేరం. ఏకంగా ఐదేళ్లు జైల్లో పెట్టేస్తారు. అంత దారుణంగా ఉంటాయి అక్కడ చట్టాలు. సమోవా అనే దేశం ఉంది. ఈ దేశంలో భర్త భార్య పుట్టినరోజు మర్చిపోతే ఫస్ట్ టైం అయితే ‘అలా ఎలా మర్చిపోతావ్ రా గాడిద’ అని వార్నింగ్ ఇస్తారట. రెండోసారి మర్చిపోతే జరిమానా విధించడం గానీ జైలుకి పంపించడం గానీ చేస్తారట.

అక్కడి చట్టం ప్రకారం భార్య పుట్టినరోజు మర్చిపోతే ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అందానికి మారుపేరుగా ఉన్న సమోవా దేశంలో ఇలాంటి చట్టం ఒకటి ఉంది. మొదటిసారి మర్చిపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి మర్చిపోతే జరిమానా వేయడమో జైలుకి పంపించడమో చేస్తారు. మరీ పెద్ద నేరంగా పరిగణిస్తే కనుక ఐదేళ్లు జైల్లో పెట్టేస్తారు. అయితే ఈ చట్టాన్ని అందరూ అనుసరిస్తున్నారో లేదో అని నిత్యం ఒక ప్రత్యేక బృందం గమనిస్తూ ఉంటుందట. పోలీసుల మాదిరి ఆ ప్రత్యేక బృందం పని చేస్తుందట. వీరికే ఫిర్యాదులు చేస్తారట. వీళ్ళు ఆ ఫిర్యాదులను తీసుకుని వెంటనే చర్యలు తీసుకుంటారట. వీళ్ళు భార్యలకు ఇలాంటి చట్టం ఒకటి ఉంది అని అవగాహన కల్పించేలా అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తారట. దీనిపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. మంచి మంచి కట్టుబాట్లు. ఈ చట్టం కనుక ఇక్కడ అమలుచేస్తే దేశంలో ఉన్న 90 శాతం భర్తలందరికీ జైలు శిక్ష పడడం ఖాయం.. కానీ జైళ్లే సరిపోని పరిస్థితి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి