iDreamPost
android-app
ios-app

ఇజ్రాయెల్ భీకర పోరులో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హతం..!

ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న పోరులో మిలిటెంట్ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా మరణించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ మిలటరీ. లెబనాన్ రాజధాని బీరూట్‌లో అతడ్ని హతం ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించిది.

ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న పోరులో మిలిటెంట్ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా మరణించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ మిలటరీ. లెబనాన్ రాజధాని బీరూట్‌లో అతడ్ని హతం ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించిది.

ఇజ్రాయెల్ భీకర పోరులో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హతం..!

ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న పోరులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో మిలిటెంట్ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా మరణించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ మిలటరీ. లెబనాన్ రాజధాని బీరూట్‌లో అతడ్ని హతం చేసినట్లు పేర్కొంది. హెజ్‌బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతాన్యాహు ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయనను మట్టు పెట్టారు ఆ దేశ సైనికులు. ఇక ఉగ్రవాదంతో హెజ్‌బొల్లా ప్రపంచాన్ని గడగడలాడించలేడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్.. ఈ వార్తను ధ్రువీకరించడం లేదు.

ఈ భీకర దాడుల దృష్ట్యా.. అమెరికా పర్యటనను రద్దు చేసుకుని స్వదేశానికి బయలు దేరారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. శుక్రవారం నుండి హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి పాల్పడింది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులతో విరుచుకుపడింది. నస్రల్లా అక్కడే ఉన్నాడని, కీలక సమావేశం నిర్వహిస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించింది. మూడు భవనాలను లక్ష్యంగా చేసుకున్న సైతం.. ఇళ్లు ఖాళీ చేయాలని నివాసితులకు చెప్పినట్లు తెలుస్తుంది. అనంతరం ఈ ఎటాక్ చేసింది. నస్రల్లా ఉన్న భవనంపై ఎటాక్ చేసింది. దీంతో ఆ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయ్యింది. అక్కడ ఎవ్వరూ బతికే అవకాశాలు లేవని ఐడీఎఫ్ తేల్చి చెబుతుంది.

హాసన్ నస్రల్లాతో పాటు ఆయన కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా మరణించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో ఆరుగురు మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే హాసన్ నస్రల్లా చనిపోయాడా లేదా అనేది మాత్రం హెజ్‌బొల్లా ఇంకా ప్రకటించలేదు. అయితే శుక్రవారం సాయంత్రం నుండి నస్రల్లా కాంటాక్ట్‌లో లేడని హెజ్‌బొల్లా వర్గాలు పేర్కొంటున్నాయి. నస్రల్లా మరణంతో మధ్య ప్రాచ్యంలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ అప్రమత్తమవుతుంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తుంది. నస్రల్లా మధ్య ప్రాచ్య దేశాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరాన్ దేశానికి నీడలాంటి వ్యక్తి. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దూకుడుతో హెజ్‌బొల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న తరుణంలో ఇరాన్.. ఇజ్రాయెల్‌తో తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లెబనాన్ లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని తెలుస్తుంది.