iDreamPost
android-app
ios-app

60 బీర్లు ఒకేసారి తాగాడు.. ఆరు నెలలైనా తగ్గని కిక్కు..!

  • Published Nov 23, 2023 | 4:09 PM Updated Updated Nov 23, 2023 | 4:09 PM

ఇటీవల కొంతమంది మందు పార్టీలో కాస్త జోష్ ఎక్కువై పందెం వేసుకుంటున్నారు. ఆ సమయంలో అధిక మొత్తంలో మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇటీవల కొంతమంది మందు పార్టీలో కాస్త జోష్ ఎక్కువై పందెం వేసుకుంటున్నారు. ఆ సమయంలో అధిక మొత్తంలో మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

60 బీర్లు ఒకేసారి తాగాడు.. ఆరు నెలలైనా తగ్గని కిక్కు..!

అధిక మొత్తంలో ఏది తీసుకున్నా అనార్థమే అంటారు.. ముఖ్యంగా తిండి, మద్యం విషయంలో ఏది ఏక్కువ అయినా తర్వాత కష్టాలు తప్పవు. దూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ సిగరెట్ డబ్బా, మందు బాటిల్ పై రాసి ఉన్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా లాగించేస్తారు. అధిక మొత్తంలో మద్యం సేవించేవారు గుండె జబ్బు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొంతమంది మద్యం పోటీలు పెట్టుకొని అధిక మొత్తంలో సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓ యువకుడు పందెం పెట్టుకొని అధిక మొత్తంలో మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన సోషల్ మీడియా వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

స్కాట్లాండ్ కి చెందిన 37 ఏళ్ల ఓ యువకుడు ఏకబిగిన 34 లీటర్ల బీరు అంటే దాదాపు 60 బీర్లు ఒకేసారి తాగేశాడు. ఆరోజు పోటీలో తాను గెలిచానని సంతోష పడ్డా.. తర్వాత అతని కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఆ యువకుడు ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. ఏనాడు చిన్న ట్యాబ్లెట్ కూడా వాడలేదు. అలాంటిది ఆ యువకుడి జీవితం ఒక్కసారే దారుణంగా మారిపోయింది. ఏకబిగిన ఒకేసారి 60 బీర్లు తాగిన తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. తలనొప్పి, హ్యాంగోవర్, బద్దకం, కంటి చూపు మందగించడం ఇలా పలు రకాల ఇబ్బందులు పడటంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతనికి సిటి స్కాన్, రక్త పరీక్ష, బీపీ అన్ని చెక్ చేశారు. సీటీ స్కాన్ చూసి డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఆ యువకుడి రక్త పరీక్షలో లూపస్ యాంటి కోగ్యూలెంట్ సిన్ డ్రోమ్స్ అనే ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రహించారు డాక్టర్లు. మద్యం సేవించిన తర్వాత ఆ యువకుడి శరీరంలో ప్రతి రోధకాలు ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. అతడి రక్తాన్ని పరీక్షించగా శరీరంలో లూపస్ యాంటికోగ్యులెంట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలాయి. ఇలా ఒక వ్యక్తి శరీరంలో ఇన్ని మార్పులు రావడానికి గల కారణం ఏంటీ? అని బాధితుడిని ప్రశ్నించడంతో అసలు నిజం బయటపెట్టాడు. ఒకరోజు బెట్టింగ్ పెట్టుకొని 60 పింట్స్ దాదాపు 28 లీట్ల బీర్లు తాగానని, ఆ తర్వాత హ్యాంగోవర్ ఎంతకీ తగ్గలేదని, చిత్ర విచిత్రమైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ వచ్చానని అన్నాడు. కంటి చూపు కూడా స్పష్టంగా లేకుండా పోయిందని అన్నాడు. నిద్ర మత్తు దాదాపు ఆరు నెలల వరకు ఉంటూవచ్చిదని అన్నాడు. మొత్తానికి అతనికి వైద్యం చేయగా ప్రస్తుతం కోలుకున్నాడు. అతనికి వచ్చింది ‘లాంగ్ గెస్ట్ హ్యాంగోవర్’ అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.