Kyrgyzstan Mob Attacks: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థులకు కేంద్రం బిగ్ అలర్ట్! మనోళ్లే టార్గెట్‌గా దాడులు!

విదేశాల్లో ఉన్న భారత విద్యార్థులకు కేంద్రం బిగ్ అలర్ట్! మనోళ్లే టార్గెట్‌గా దాడులు!

విదేశాల్లో ఉన్న భారత విద్యార్థులకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. భారత విద్యార్థులే టార్గెట్‌గా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని.. ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులపై అల్లరి మూక దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలు దేశాలకు చెందిన విద్యార్థులపై దాడులు చేసింది. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారత విద్యార్థులు భద్రతపై కేంద్రం పలు సూచనలు చేసింది.

విదేశాల్లో ఉన్న భారత విద్యార్థులకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. భారత విద్యార్థులే టార్గెట్‌గా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని.. ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులపై అల్లరి మూక దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలు దేశాలకు చెందిన విద్యార్థులపై దాడులు చేసింది. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారత విద్యార్థులు భద్రతపై కేంద్రం పలు సూచనలు చేసింది.

అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిర్గిస్తాన్ దేశంలో అల్లరి మూక దాడులకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చదువుకుంటున్న మన భారతీయ విద్యార్థులకు కేంద్రం బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో అల్లరి మూక హింసకు తెరలేపింది. దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు భద్రతపై భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. భారత విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. అల్లరి మూక చేసిన దాడిలో పాకిస్తాన్ కి చెందిన పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వాళ్ళు ఉంటున్న హాస్టల్ లోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో భారత విద్యార్థుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.

ఇదే విషయమై అక్కడ భారతీయ రాయబార కార్యాలయం నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. మన భారత విద్యార్థులతో టచ్ లోనే ఉంటున్నామని.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉందని.. కాబట్టి అక్కడున్న భారత విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత విద్యార్థులు బయటకు రావొద్దని.. ఏదైనా సమస్య ఉంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. హెల్ప్ లైన్ నంబర్ 05557 10041కి కాల్ చేయండని.. భయపడకండి అంటూ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. బిష్కెక్ లో ఉన్న భారత విద్యార్థులు భద్రతను పర్యవేక్షిస్తున్నామని.. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని.. ప్రశాంతంగా అక్కడి వాతావరణం ఉందని అన్నారు.

ఇక కిర్గిస్తాన్, ఈజిప్టుకి చెందిన విద్యార్థుల మధ్య మే 13న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కిర్గిజ్, ఈజిప్టు విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ వల్లే మూకదాడులు మొదలయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ కూడా అదే ఆరోపిస్తుంది. బిష్కెక్ లో మెడికల్ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులపై దాడి చేస్తుంది ఈ మూకే అని ఆరోపించింది. భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో పాక్ కి చెందిన విద్యార్థులు చనిపోయారని ఆ దేశం అంటుంటే.. కిర్గిస్తాన్ మాత్రం ఈ దాడుల్లో విదేశీ విద్యార్థులు చనిపోలేదని చెబుతుంది. అయితే ఇప్పటి వరకూ బిష్కెక్ లో మెడికల్ యూనివర్సిటీలో పలు హాస్టల్స్, ప్రైవేటు రెసిడెన్సీల్లో ఉన్న పాకిస్తాన్ విద్యార్థులతో సహా ఇతర దేశాల విద్యార్థులపై కూడా దాడులు జరిగాయి.

Show comments