iDreamPost
android-app
ios-app

ఫ్రాన్స్ అదుపులో 300 మందికిపైగా భారతీయులున్న విమానం.. కారణం ఇదే

సామాన్యుడి అందని, కలగనే ప్రయాణ సాధనం ఏదైనా ఉందంటే.. అది విమానమే. త్వరగా గమ్య స్థానానికి చేర్చే వాహనం కూడా ఇదే. అయితే అనుకుంటాం కానీ.. కొన్ని సార్లు.. విమాన ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులు ఇబ్బందులు, ఇక్కట్లకు గురౌతుంటారు.

సామాన్యుడి అందని, కలగనే ప్రయాణ సాధనం ఏదైనా ఉందంటే.. అది విమానమే. త్వరగా గమ్య స్థానానికి చేర్చే వాహనం కూడా ఇదే. అయితే అనుకుంటాం కానీ.. కొన్ని సార్లు.. విమాన ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులు ఇబ్బందులు, ఇక్కట్లకు గురౌతుంటారు.

ఫ్రాన్స్ అదుపులో 300 మందికిపైగా భారతీయులున్న విమానం.. కారణం ఇదే

గమ్య స్థానానికి త్వరగా చేర్చగలిగే ఏకైక ప్రయాణ సాధనం విమానం. అలాగే ఈ ప్రయాణం ఖర్చుతో కూడా కూడుకున్నది. అయితే ఈ విమాన ప్రయాణాల్లో కొన్ని సార్లు వింత అనుభవాలు, ఊహించని సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. తప్పతాగి వచ్చి తోటి ప్రయాణీకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకున్న ఘటనలు చూశాం. విదేశీ ప్రయాణాల్లో కానీ, విమాన జర్నీలో, ఎయిర్ పోర్టుల్లో సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలకు చేదు అనుభవాలు చవి చూసిన దాఖలాలున్నాయి. అలాగే విమానం హైజాక్ చేయడం వంటి భయానక పరిస్థితులు ఉంటాయి. తాజాగా ఓ భారతీయ ప్రయాణీకులతో వెళుతున్న విమానాన్ని మార్గ మధ్యంలోనే నిలిపివేశారు. కారణం ఏంటంటే..?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి నికరాగ్వా రాజధాని మనాగ్వాకు భారతీయ ప్రయాణీకులతో వెళుతున్న విమానాన్ని మార్గ మధ్యంలో ఆపేశారు. ఇంధనం నింపుకునేందుకు ప్యారిస్ సమీపంలోని చిన్న విమానాశ్రయమైన వ్యాట్రీ ఎయిర్ పోర్టులో విమానం దిగిన వెంటనే పోలీసులు.. విమానాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న ఓ ఆగంతక వ్యక్తి అందించిన సమాచారంతో రంగంతోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందులో సుమారు 303 మంది భారతీయ ప్రయాణీకులున్నారు. ఎయిర్ బస్ ఏ 340ను ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో దిగ్భందించినట్లు ప్రెంచ్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణీకులు గందరగోళానికి గురయ్యారు. రొమేనియాకు చెందిన ఈ ఎయిర్ లైన్స్ విమానం దుబాయి నుండి నికరాగ్వాకు బయలు దేరగా.. మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతోనే మార్గమధ్యంలో నిలిపివేశారు. దీంతో వ్యాటీ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. కొంత మంది ప్రయాణీకులను వలసదారులుగా భావిస్తుండటంతో విచారణ చేపట్టారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణీలకులకు బస ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  ఊహించిన ఈ సంఘటనకు భారతీయ ప్రయాణీకులు ఇక్కట్లు పడటమే కాకుండా.. ఇబ్బందికి గురయ్యారు. ఓ ఆగంతుకుడి కారణంగా విమానమే నిలిపివేసిన ఈ ఘటనపై మీ  అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.