iDreamPost
android-app
ios-app

మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. ఆస్పత్రిలో చికిత్స!

ఓ మాజీ క్రికెటర్ అడవిలో ట్రెక్కింగ్ చేస్తుండగా.. హఠాత్తుగా ఓ చిరుత ఆయనపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం.. హుటాహుటిన ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు

ఓ మాజీ క్రికెటర్ అడవిలో ట్రెక్కింగ్ చేస్తుండగా.. హఠాత్తుగా ఓ చిరుత ఆయనపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం.. హుటాహుటిన ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు

మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. ఆస్పత్రిలో చికిత్స!

ఇటీవల కాలంలో వన్యమృగాలు మనుషులపై దాడి చేస్తున్నాయి. జనవాస ప్రాంతాల్లోకి వచ్చి అందరినీ భయాందోళకు గురి చేస్తున్నాయి. ఇక ఈ వన్య మృగాల దాడిలో ఎంతో మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి చేయడంతో ఇద్దరు మరణించారు. తాజాగా ఓ మాజీ క్రికెటర్ పై చిరుతదాడి చేసింది. ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఆయన ఎవరు, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది ట్రక్కింగ్ కోసం అడవికి వెళ్తుంటారు. అలానే ఫారెస్ట్ అందాలను వీక్షించేందుకు సరదా వెళ్తుంటారు. అయితే ఈ సరదగా చేసే యాత్రలో ఒక్కొక్కసారి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంటాయి. అలా ట్రెక్కింగ్ కోసం వెళ్లిన జింబాబ్వే మాజీ క్రికెటర్ గైవిటాల్ పై చిరుత దాడి చేసింది. అయితే ఈ చిరుత దాడిలో ఆయన తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. జింబాబ్వేలోని బఫెలో రేంజ్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఇక చిరుతపులి దాడిలో గాయపడిన గై విట్టాల్‌ను అత్యవసర శస్త్ర చికిత్స అందించారు. ఆయనకు చికిత్స అందించేందుకు ప్రత్యేక విమానంలో హరారేకు తరలించారు అధికారులు.

ఇక విటాల్ భార్య హన్నా స్టూక్స్ తీవ్ర గాయాలతో ఉన్న ఆయన ఫోటోలను  సామాజిక మాద్యంలో షేర్ చేశారు. తన భర్తకు చికిత్స చేసిన వైద్య సిబ్బందికి ఆమె కృతజ్ఞతలను తెలుపుతూ పోస్టు పెట్టారు. చిరుత దాడితో విటాల్ కి తీవ్ర రక్తస్రావం అయినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక ఆమె చిరుత దాడి గురించి పోస్టు పెట్టగానే.. యన శ్రేయోభిలాషులు వందలాది మెసేజ్ లు పెట్టారు. అలానే హిప్పో క్లినిక్‌లోని వైద్య సిబ్బంది తక్షణమే స్పందించడం తాము చాలా అదృష్టవంతుల విటాల్ భార్య తెలిపారు. గై విటాల్ జింబాబ్వేలో సఫారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. హ్యూమనిలో ప్రాంతంలో ఆయన ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ చిరుత దాడికి గురయ్యారు. గతంలో ఆయన ఓ మొసలి దాడి నుంచి కూడా త్రుటిలో తప్పించుకున్నారు.

2013లో జింబాబ్వేలోని హ్యూమని లాడ్జ్‌లో ఆయన మంచం కింద 8 అడుగుల పొడవున్న మొసలి వచ్చింది.  ఆ మొసలి లోనికి దూరడం ఎవరూ గమనించలేదు. ఆ మొసలి  150 కేజీల బరువు ఉంది. మరుసటి రోజు ఉదయం అల్పాహారం చేస్తున్న సమయంలో ఇంట్లో పనిమనిషి ఆ మొసలిని  గుర్తించింది. రాత్రంతా ఆయన బెడ్ కిందే మొసలి నిద్రపోవడం గమనార్హం. ఆ సమయంలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక దశాబ్దం పాటు జింబాబ్వే క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగిన విటాల్ కొనసాగారు. ఇక విటాల్ 46 టెస్టులు, 147 వన్డేలు ఆడారు.