ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. సాంకేతిక విప్లవంతో పాటు మొబైల్ కంపెనీల మధ్య పోటీ వల్ల ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో వీటి వాడకం బాగా పెరిగిపోయింది. కూరగాయల దగ్గర నుంచి ట్యాక్సీ వరకు ప్రతిదీ ఆర్డర్ చేసుకునేందుకు యాప్స్ వచ్చేశాయి. కాలక్షేపానికి గేమ్స్‌తో పాటు ఓటీటీలు, యూట్యూబ్, సోషల్ మీడియా ఎలాగూ ఉండనే ఉన్నాయి. దీంతో చిన్నారుల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. ఫోన్లకు క్రమంగా అందరూ అడిక్ట్ అయిపోతున్నారు.
అవసరాన్ని బట్టి మొబైల్ ఫోన్ వాడేవారి సంఖ్య తక్కువే. అవసరం లేకపోయినా కాలక్షేపానికి, సరదాకు మొబైల్స్ వాడుతూ వాటికి చాలా మంది బానిసలుగా మారుతున్నారు. చేస్తున్న పనిని కూడా పక్కనబెట్టి మరీ మొబైల్స్‌ను చూడటం కొందరికి ఒక హాబీలా మారిపోయింది. అలాంటి అలవాటే ఒక ప్రధాని ప్రాణం మీదకు తెచ్చింది. ఫిజీ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ఆయన చైనా అధికార పర్యటనను అనూహ్యంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
సితివేణి రబుకా తలకు గాయమైన విషయాన్ని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో కలసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజి ప్రధాని హాజరు కావాల్సి ఉంది. అయితే తన తలకు గాయం కావడంతో చైనా టూర్‌ను రద్దు చేసుకున్నానని స్వయంగా సితివేణి రబుకా వెల్లడించారు. ఫోన్‌ను చూస్తుండగా మెట్ల మీద నుంచి జారిపడ్డానని, దీంతో తన తలకు గాయమైందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో ద్వారా ఆయన తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. ఆ వీడియోలో ఆయన చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు కనిపించడం గమనార్హం.
An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF
— Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023