iDreamPost
android-app
ios-app

వీడియో: కూతురు తలపై CC కెమెరా అమర్చిన తండ్రి..ఎందుకంటే?

  • Published Sep 10, 2024 | 8:20 AM Updated Updated Sep 10, 2024 | 8:20 AM

Viral Video: నేటి సమాజంలో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోతుంది.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి క్షేమంగా ఇంటికి చేరే వరకు టెన్షన్ గా మారిపోయింది. గుడి, బడి, రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది.

Viral Video: నేటి సమాజంలో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోతుంది.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి క్షేమంగా ఇంటికి చేరే వరకు టెన్షన్ గా మారిపోయింది. గుడి, బడి, రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది.

  • Published Sep 10, 2024 | 8:20 AMUpdated Sep 10, 2024 | 8:20 AM
వీడియో: కూతురు తలపై CC కెమెరా అమర్చిన తండ్రి..ఎందుకంటే?

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిత్యం లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కామంధులు వెకిలి చేష్టలు చేయడం, అత్యాచారాలకు పాల్పపడటం జరుగుతుంది. కొన్ని చోట్ల వావి వరసలు మర్చిపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నలు, కన్నతండ్రి సైతం అత్యాచారాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటింది ఓ తండ్రి తన కూతురుని కాపాడుకోవడాని వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దాయది దేశం పాకిస్థాన్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తలపై సీసీ కెమెరా అమర్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాకిస్థాన్ కి చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి తన కూతురు తలపై సీసీ కెమెరా అమర్చి వార్తల్లో నిలిచాడు. ఈ విషయం గురించి యువతి మాట్లాడుతూ.. తన తండ్రి తన తలపై ఉన్న సెక్యూరిటీ కెమెరా ద్వారా 24/7 పర్యవేక్షిస్తుంటారని తెలిపింది. ఇదంతా తన భద్రత కోసమే అని.. సొసైటీలో ఆడవాళ్లకు సెక్యూరిటీ లేకుండా పోతుందని.. ఈ కెమెరా తనకు ఎల్లవెలలా ప్రొటెక్షన్ గా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువతి తెలిపింది. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని యువతి తెలిపింది. తన తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం తనకు ఎలాంటి భయం లేకుండా ఉన్నట్లు ఆ యువతి తెలిపింది.

ఇటీవల కరాచీలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. ఈ సంఘటన తన తండ్రిపై తీవ్ర ప్రభావం చూపించిందని.. ఎవరైనా తనను యాక్సిడెంట్ లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుంది. అలాగే కరాచీలో దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు వంటి ఘటనలు జరుగుతున్నాయి.. వాటి నుంచి భద్రత కల్పించేందుకు తన తండ్రి ఇలా తలపై సీసీ టీవీ కెమెరాను అమర్చినట్లు యువతి చెబుతుంది. ఇదంతా తనపై ప్రేమతోనే తన తండ్రి చేశాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యువతి తలపై కెమెరాతో వీధుల్లో తిరుగుతుంటే స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీనికి సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. చూడటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. అమ్మాయిల రక్షణకు ఇది మంచి ఉపాయం అని అంటున్నారు నెటిజన్లు. మరికొంతమంది సమ్ థింగ్ ఈజ్ ఫిషీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetbetsilinjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet