Arjun Suravaram
Boss For Sale In China: సెకండ్ హ్యాండ్ వస్తువులను, ఇతర వస్తువులను ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ పై అమ్మకానికి పెట్టడం సహజం. అవి వస్తువులు కాబట్టి.. అమ్మకాలు, కొనుగోలు వంటివి బాగానే ఉంటాయి. కానీ ఓ ప్రాంతంలో బాస్ లను, ఉద్యోగులను, తోటి ఉద్యోగులను అమ్మకం పెట్టడం జరుగుతుంది.
Boss For Sale In China: సెకండ్ హ్యాండ్ వస్తువులను, ఇతర వస్తువులను ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ పై అమ్మకానికి పెట్టడం సహజం. అవి వస్తువులు కాబట్టి.. అమ్మకాలు, కొనుగోలు వంటివి బాగానే ఉంటాయి. కానీ ఓ ప్రాంతంలో బాస్ లను, ఉద్యోగులను, తోటి ఉద్యోగులను అమ్మకం పెట్టడం జరుగుతుంది.
Arjun Suravaram
సాధారణంగా ఎక్కడైన ఉద్యోగం అనగానే ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగులు, వారిపైన మేనేజ్ చేసే టీమ్ లీడర్లు, అంతేకాక వీరందరిపైన బాస్ ఒకరు ఉంటారు. ఉద్యోగాల్లో ఉంటే ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి వారి స్థాయిని బట్టి ప్రెసజర్ అనేది ఉంటుంది. ఇక వర్క్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగిన…దానిని బాస్ అందరి ముందు ఉంచి అవమానించినా, ఇక ఆ ఒత్తిడి మరికాస్త ఎక్కువవుతుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతారు. ఇంకా చెప్పాలంటే..డిప్రెషన్ లోకి వెళ్లి.. పనిపై వ్యతిరేకతను చూపిస్తుంటారు. ఇలాంటి సమస్యల నుచిం బయటపడేందుకే కొందరు ఉద్యోగులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగులు తమకు నచ్చని బాస్‌లను, తోటి ఉద్యోగులను సెకెండ్ హ్యాండ్ ఆన్ లైన్ లో అమ్మాకానికి పెడుతున్నారు. మరి.. ఈ వింత సెల్స్ ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సెకండ్ హ్యాండ్ వస్తువులను, ఇతర వస్తువులను ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ పై అమ్మకానికి పెట్టడం సహజం. అవి వస్తువులు కాబట్టి.. అమ్మకాలు, కొనుగోలు వంటివి బాగానే ఉంటాయి. కానీ బాస్ లను, ఉద్యోగులను, తోటి ఉద్యోగులను అమ్మకం పెట్టడం ఏమిటి. అది కూడా జరుగుతుంది. అయితే మన దేశంలో మాత్రం కాదు.. ఈ వింత ట్రెండ్ ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది. అలీబాబాకు చెందిన సెకెండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం క్జియాన్‌యు ఈ కొత్త ట్రెండ్ కి వేదికగా నిలుస్తోంది. పని ఒత్తిడి, ఆఫీసు వాతావరణంతో విసిగిపోయిన ఉద్యోగులు, తమకు నచ్చని బాస్‌లు, ఇతర ఉద్యోగాలను వెబ్‌సైట్‌లో జాబితా పెడుతున్నారు. వీరిని మూడు వర్గాలు గా విభజించి అమ్మకానికి పెడుతున్నారు.
‘బాధించే బాస్‌లు’, అసహ్యించుకునే తోటి ఉద్యోగులు, ‘భయం పుట్టించే ఉద్యోగాలు’ అంటూ విభజించారు. అంతేకాక వీరికి ధరలు కూడా నిర్ణయిస్తున్నారు. వారి వారి స్థాయి ప్రతిభను బట్టీ ధరను రూ.4 నుంచి రూ.9 లక్షల వరకు నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఉద్యోగి తన జాబ్‌ను రూ.91 వేలకు అమ్మకానికి పెట్టింది. నెలకు రూ.33 వేల సాలారీ వస్తుందని, తన ఉద్యోగం కొనుక్కుంటే 3 నెలల్లోనే అసలు మొత్తం వస్తుందన రాసుకొచ్చింది. అలానే మరో ఉద్యోగి..‘పక్కవారిని హేళన చేయడంలో ముందువరుసలో ఉండే తన సహోద్యోగిని 3,999 యువాన్లకు అంటే మన ఇండియన్స్ కరెన్సీలో సుమారు రూ.45, 945 కు విక్రయించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపాడు. ఆయన వల్ల బలిపశువు కాకుండా 10 చిట్కాలను కూడా చెప్తానంటూ ఆఫీసులో తనకు ఇబ్బంది కలిగించే వ్యక్తిని అమ్మకానికి పెట్టారు.
మరో యంగ్ ప్రొఫెషనల్ తన బాస్‌ను 500 యువాన్లుకు అమ్మకానికి పెట్టాడు. చీటికీ మాటికీ కించపరుస్తున్నాడన్న కారణంతో తన బాస్ ను ఆ వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. అయితే ఇవ్వన్నీ చూసి..మీరు నిజమే అనుకునేరు. అదేం లేదండీ.. ఇదంతా కేవలం కల్పితం మాత్రమే. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చైనాలోని ఉద్యోగులు అనుసరిస్తున్న ఓ విధానం మాత్రమే ఇది. దీనినే అక్కడ ‘వర్క్ స్మెల్’ అని పిలుస్తున్నారు. అయితే ఈ వింత పోకడపై చైనాలోనే మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం యువత ఎటువైపు వెళ్తోంది.. ఇదేం వెర్రి?నా అంటూ ప్రశ్నిస్తున్నారు.