P Krishna
Earthquake Strikes Japan: ఇటీవల భారీ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుస భూకంపాలతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. జపాన్ ని భారీ భూకంపం వణికించింది.
Earthquake Strikes Japan: ఇటీవల భారీ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుస భూకంపాలతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. జపాన్ ని భారీ భూకంపం వణికించింది.
P Krishna
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు పలు భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారత్, నేపాల్, చైనా,ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, జపాన్, మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది ప్రకృతి ప్రకోపానికి సిరియా, తుర్కియే లో భారీ భూకంపం వల్ల ఏకంగా 50 వేల మందికి పైగా మరణించారు.. వేల సంఖ్యల్లో గాయపడ్డారు. సాధారణంగా జపాన్ లో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా జపాన్ లో మరోసారి భారీ భూకంపం వణికించింది.పూర్తి వివరాల్లోకి వెళితే..
జపాన్ లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. నైరుతి దీవులైన క్యూషు, షికోలో శక్తి వంతమైన భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదు అయ్యింది. భూకంప ధాటికి భారీ భవనాలు కుప్పకూలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. భూ ప్రకంపనాలకు ప్రజలు భయబ్రాంతులకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు భూకం ప్రభావం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. గత కొంత కాలంగా నుంచి ఈ ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయని.. ఈసారి మాత్రం భారీ భూకంపం వచ్చిందని అధికారులు అంటున్నారు.
భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కొచ్చి, ఓయిటా, మియాజాకి, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.క్యూషులోని మియాజాకి ప్రిఫెక్చర్ లో 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసి పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఎవరూ సముద్ర ప్రాంతం వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. అంతేకాదు సముద్ర తీరంలో ఉండేవారు, నదులు, సరస్సుల సమీపంలో ఉండేవారు వెంటనే అక్కడ నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి.
Magnitude 7.1 #earthquake strikes #Japan coast, tsunami alert has been issued. #JapanEarthquake
Read ⬇️https://t.co/ytgJ9s0QEA
— NDTV Profit (@NDTVProfitIndia) August 8, 2024