iDreamPost
android-app
ios-app

7.0 తీవ్రతతో రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

  • Published Aug 18, 2024 | 4:27 PM Updated Updated Aug 18, 2024 | 4:27 PM

Earthquake in East Coast of Russia: గత కొంత కాలంగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఏడాది టర్కీ- సిరియాలో సంభవించిన భూకంప విషాదాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా రష్యా భూకంపంతో గజ గజ వణికిపోయింది.

Earthquake in East Coast of Russia: గత కొంత కాలంగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఏడాది టర్కీ- సిరియాలో సంభవించిన భూకంప విషాదాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా రష్యా భూకంపంతో గజ గజ వణికిపోయింది.

7.0 తీవ్రతతో రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ భూకంపాలు ఎక్కువగా మలేషియా,అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, నేపాల్, చైనా, జపాన్, భారత్, రష్యాలో ఎక్కువ సంభవిస్తున్నాయి. వారం రోజుల క్రితమే జపాన్ లోని క్యుషు, షికోకు దీవుల్లో భారీ భూకంపం సంభవించింది.. దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. జపాన్ లోని అనేక తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్, నెపాల్ లో తరుచూ భూకంపాలు భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఆ దేశ తూర్పు తీర ప్రాంతం వణికిపోయింది. ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు.  వివరాల్లోకి వెళితే..

ఈ మధ్యనే జపాన్, తైవాన్ దేశాల్లో భారీ భూకంపాలు తీవ్ర ఆందోళన కలిగించాయి.. ఇది మరువక ముందు రష్యాలో భారీ భూకంపం భయాందోళన సృష్టించింది. రిక్టర్ స్కేల్ పై ఏకంగా 7.0 తీవ్రత నమోదు అయ్యింది. రష్యా తూర్పు తీరంంలోని మెయిన్ నావల్ హెడ్ క్వార్టర్ కు సమీపంలో ఒక్కసారిగా భూమి కంపించినట్లు అక్కడ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపం వల్ల వస్తువులు కిందపడిపోయినట్లు తెలిపారు.  ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలు వదిలి వీధుల్లోకి పరుగులు పెట్టారు. కాగా, ఇప్పటి వరకు భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారుల తెలిపారు.