iDreamPost
android-app
ios-app

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్! కానీ.. 20 నిమిషాల్లోనే..

  • Author Soma Sekhar Published - 09:01 AM, Fri - 25 August 23
  • Author Soma Sekhar Published - 09:01 AM, Fri - 25 August 23
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్! కానీ.. 20 నిమిషాల్లోనే..

డొనాల్డ్ ట్రంప్.. సంచలనాలు కేంద్ర బిందువుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కాగా.. డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అందులో లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆనయపై నమోదైయ్యాయి. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ జార్జియా జైల్ వద్ద పోలీసులకు లొంగిపోయాడు. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాము పోలీసులకు లొంగిపోయినా.. దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. తాజాగా మరోసారి ట్రంప్ అరెస్ట్ కావడం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. జార్జియా జైలు వద్ద పోలీసులకు ట్రంప్ లొంగిపోయారు. 2020 అమెరికా ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకోవడం, కుట్ర తదితర కేసుల్లో ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పటికే ట్రంప్ స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి.. రెండు లక్షల విలువైన బాండ్ ను సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ జైలుకు వెళ్లారు.

కాగా.. ట్రంప్ పై నమోదు అయిన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటిగా పోలీసులు వెల్లడించారు. అయితే ట్రంప్ కేవలం 20 నిమిషాలు మాత్రమే జైల్లో గడిపి..అనంతరం బెయిల్ పై బయటకొచ్చాడు. ఇక కొన్ని రోజుల కిందట కూడా ట్రంప్ 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు. కాగా.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

ఇదికూడా చదవండి: వైరల్‌గా మారిన పిల్లాడి వ్యాఖ్యలు.. పుట్టిన 9 రోజులకే నడిచాడట!