iDreamPost

యజమానికి షాకిచ్చిన పెంపుడు కుక్కు.. రూ.3లక్షలకుపైగా మిగేసేసింది!

శునకం అత్యంత విశ్వాసం గల జంతువు అనే విషయం మనకు తెలిసిందే. అయితే కొన్నిసార్లు విశ్వాసం, నమ్మకం గల ఈ కుక్కలు కూడా తమ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తాయి.

శునకం అత్యంత విశ్వాసం గల జంతువు అనే విషయం మనకు తెలిసిందే. అయితే కొన్నిసార్లు విశ్వాసం, నమ్మకం గల ఈ కుక్కలు కూడా తమ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తాయి.

యజమానికి షాకిచ్చిన  పెంపుడు కుక్కు.. రూ.3లక్షలకుపైగా మిగేసేసింది!

చాలా మందికి మూగ జీవాలు అంటే ఎంతో ఇష్టం. అందుకే కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, చిలుకలు వంటి వివిధ రకాల జీవులను పెంచుకుంటారు. అయితే ఎక్కువ మంది కుక్కలను పెంచుకుంటారు. కారణం.. అవి భద్రతకు కూడా ఉపయోగపడతాయి. ఎవరైనా శుత్రువులు దాడి చేసినప్పుడు అవి కాపాడుతుంటాయి. ఇలా ఎంతో ఇష్టంగా పెంచుకునే శునకాలు ఒక్కొక్కసారి ఓనర్లకు షాకిస్తుంటాయి. గతంలో ఓ కుక్క లక్షలాది రూపాయలను నాశనం చేసింది. తాజాగా మరో శునకంగా రూ.3 లక్షలకు పైగా డబ్బులను తినేసింది. ఈ ఘటన పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

పెన్సిల్వేనియా పట్టణంలో క్లేటన్,  క్యారీలా అనే దంపతులు ఉన్నారు. వారు చాలా కాలం నుంచి ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది కూడా ఓనర్లతో ఎంతో  సరదగా ఉండేది. ఇక క్వారీలా దంపతులు ఆ శునకాన్ని తమ కుటుంబ సభ్యుల చూసుకునే వారు. దానికి ఏ చిన్న కష్టం రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఇలా ఆ దంపతులు ఎంతో  ప్రేమగా చూసుకున్న ఆ శునకం..వారికి షాకిచ్చింది. ఓ రోజు క్వారీలా ఇంట్లో పెట్టిన డబ్బులు కనిపించలేదు. దీంతో వారు చాలా కంగారు పడిపోయారు. ఇంట్లోకి దొంగలు వచ్చిన ఆనవాళ్లు లేవు. దీంతో అసలు ఏం జరిగిందే ఆ దంపతులకు అర్థం కాలేదు. దీంతో ఇంటిని కాసేపు నిశితంగా పరిశీలించగా, వారి పెంపుడు కుక్క..కాస్తా తేడాగా కనిపించింది. చివరకు తమ పెంపుడు కుక్క ఆ నోట్లను నమిలేసినట్లు ఆ దంపతులు గుర్తించారు.

కానీ, వారి పెంపుడు కుక్క ఎప్పుడు ఇంట్లో వస్తువులను నాశనం చేయలేదు. అందుకే తొలుత ఆ శునకంపై వారికి చాలా సమయం వరకు అనుమానం, సందేహం రాలేదు.  కానీ, అక్కడ కనిపించిన పరిస్థితిని చూస్తే.. కుక్క ఆ నోట్లను ఆకలి తీరేవరకు నమిలి తినేసినట్లు  గుర్తించారు. మిగిలిన కొన్ని నోట్లను చించివేసిందని గమనించారు. దాంతో కుక్క మింగిన నోట్లను వెలికి తీయడానికి ఓ విచిత్రమైన మార్గం ఎంచుకున్నారు. కుక్క చించేసేన నోట్లను సేకరించి బ్యాంకు వద్దకు వెళ్లారు. వారు సీరియల్ నెంబర్ ప్రకారం ఇవ్వడంతో వాటి బదులు కొత్త కరెన్సీని తీసుకున్నారు.  ఇంకా దారుణం ఏమిటంటే కుక్కు నుంచి వచ్చిన మలం, వాంతిని కూడా సేకరించి.. అందులోనూ నోట్లను వెతకడం ప్రారంభించారు.

అలా చాలా సమయంల పాటు శ్రమించిన ఈ దంపతులు.. 3550 డాల్లరు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.2.95 లక్షల విలువైన నోట్లను సేకరించారు. వాటిలోని కొన్ని నోట్ల సీరియల్ నెంబర్లను కనిపెట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను క్వారీలా దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.  తమ జీవితంలో ఇలాంటి పని చేయాల్సి వస్తుందని ఊహించలేదని ఆ దంపతులు వాపోయారు. తమ కుక్కు అలాంటి పని చేసిందంటే నమ్మలేకపోయామని, కానీ నిజంగా అది నోట్లను తిన్నదని తెలిసి..తనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా అయిందని క్వారీ లా తెలిపింది.  ఇలాంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. మరి.. పెంపుడు కుక్క చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Carrie Law (@ooolalaw)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి