iDreamPost
android-app
ios-app

డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..

  • Published Sep 21, 2023 | 9:18 PM Updated Updated Sep 21, 2023 | 9:18 PM
  • Published Sep 21, 2023 | 9:18 PMUpdated Sep 21, 2023 | 9:18 PM
డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..

కొంతమంది వైద్యులు వైద్య వృత్తికే కలంకం తెచ్చే పనులు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఏటా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారు. తాజాగా, ఓ యువకుడు డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ అతడి కడుపులో ఏకంగా 15 సెంటీ మీటర్ల కత్తిని వదిలేశాడు. ఈ సంఘటన నేపాల్‌ దేశంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నేపాల్‌ దేశ రాజధాని ఖాట్మాండుకు చెందిన ఓ యువకుడు వీధి గొడవల్లో పాల్గొన్నాడు. ఈ గొడవల్లో ప్రత్యర్థుల కారణంగా కడుపు దగ్గర కత్తిగాట్లు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని కుటుంబసభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్‌ యువకుడికి ఆపరేషన్‌ చేసి కుట్లు వేశాడు. తర్వాత ఇంటికి పంపేశాడు. అయితే, ఇంటికి వెళ్లిన కొన్ని గంటలకు యువకుడి కడుపులో నొప్పి రావటం మొదలైంది. దీంతో అతడ్ని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిటీ స్కాన్‌ చేయగా షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

అతడి కడుపులో కత్తి ఉన్నట్లు తేలింది. దాని గురించి ఆరా తీయగా.. అతడికి వైద్యం చేసిన డాక్టర్‌ ఏకంగా 15 సెంటీమీటర్ల ఆ కత్తినో పొట్ట లోపల పెట్టి కుట్లు వేసినట్లు తేలింది. డాక్టర్లు వెంటనే కడుపులోని కత్తిని బయటకు తీశారు. యువకుడి కుటుంబసభ్యులు సదరు వైద్యుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom