Arjun Suravaram
'పిల్లలను కంటే డబ్బులు ఇస్తారనే తెలుసా.. అది కూడా లక్షల్లో డబ్బులు ఇస్తారు. ఇది ఓ కంపెనీ ఇచ్చిన వింత ఆఫర్. 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సర్రోగేట్ తల్లులుగా మారితే.. రూ.25 లక్షలకు పైగా సంపాదించవచ్చును.
'పిల్లలను కంటే డబ్బులు ఇస్తారనే తెలుసా.. అది కూడా లక్షల్లో డబ్బులు ఇస్తారు. ఇది ఓ కంపెనీ ఇచ్చిన వింత ఆఫర్. 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సర్రోగేట్ తల్లులుగా మారితే.. రూ.25 లక్షలకు పైగా సంపాదించవచ్చును.
Arjun Suravaram
మహిళ జీవితంలో అమ్మతనం అనేది ఎంతో మధురమైనది. దానికి డబ్బుతో విలువ కట్టలేము. అందుకే ఎంతో మంది పెళ్లైన మహిళలు అమ్మ అనే పిలుపు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక పిల్లల విషయంలో ఓ విచిత్రమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పిల్లల్ని కంటే రూ.25 లక్షలకు పైగా సంపాదించ వచ్చు. పిల్లల్ని కంటే డబ్బులు ఇవ్వడం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా?. ఈ వార్త నిజమే..కచ్చితంగా లక్షల్లో డబ్బులు సంపాదించ వచ్చు. మరి.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
పిల్లల్ని కని డబ్బులు సంపాదించడమనే మన దేశంలో ఉన్న ఆఫర్ కాదు.. చైనాలోని ఓ కంపెనీ మహిళలకు ఇచ్చిన వింత ఆఫర్ ఇది. 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సర్రోగేట్ తల్లులుగా మారితే.. లక్షలు సంపాదించకోవచ్చునని ఆ కంపెనీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. అయితే చైనాలో సరోగసీ పద్ధతి అనేది చట్టవిరుధ్దం. అలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే.. అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం…. చైనా దేశంలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన హుచెన్ హౌస్ కీపింగ్ అనే కంపెనీ ఆడవాళ్లకు వింత ఆఫర్ ప్రకటించింది. 28 ఏళ్ల కంటే తక్కువవయస్సు ఉన్నవారు సరోగ్రసి ద్వారా తల్లులుగా మారితే 35,000 అమెరికన్ డాలర్ల అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ. 25 లక్షలు కంటే ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది. అలానే 29 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు కంపెనీ 2,10,000 యువాన్లను అంటే మన కరెన్సీలో సుమారు రూ. 25 లక్షలు చెల్లిస్తుంది. అలానే 40 నుంచి 42 ఏళ్ల వయసున్న మహిళలు సరోగసీ ద్వారా తల్లులుగా మారితే.. వారికి కంపెనీ 1,70,000 యువాన్లను అంటే మన కరెన్సీలో రూ. 20 లక్షలు ఆఫర్ చేసింది.
ఇది అక్కడ చట్టవిరుద్ధమైనప్పటికీ జిన్‌జియాంగ్, షాంఘై ప్రాంతాల్లో ఈ కంపెనీ తమ శాఖలను కొనసాగిస్తుంది. ఈ ప్రకటనపై అక్కడి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆఫర్‌తో తాము చాలా కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని సదరు కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి తమ వాదనను వినిపించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి.. ఈ వింత ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.