గాలిని టిన్నుల్లో ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు.. ధర ఎంతో తెలుసా?

గాలిని డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్న కంపెనీ. గాలిని అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు గాలిని టిన్నుల్లో ప్యాక్ చేసి విక్రయిస్తోంది ఓ కంపెనీ. ధర ఎంతంటే?

గాలిని డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్న కంపెనీ. గాలిని అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు గాలిని టిన్నుల్లో ప్యాక్ చేసి విక్రయిస్తోంది ఓ కంపెనీ. ధర ఎంతంటే?

గాలి పంచ భూతాల్లో ఒకటి. గాలి లేకపోతే మానవాళికి మనుగడే లేదు. ప్రస్తుత రోజుల్లో వాయుకాలుష్యం పెరిగిపోతున్నది. స్వచ్ఛమైన గాలి కరువైపోయింది. కలుషితమైన గాలిని పీల్చుకుని అనారోగ్యాలపాలవుతున్నారు. బాణా సంచా, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యానికి గురవుతున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ కూడా గాలి కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. అయితే బ్రాండెడ్ బట్టలు, కార్లు, ఫోన్లు కొన్నట్టుగా క్వాలిటీ గాలిని కొనలేం కదా. దొరికిన గాలినే పీల్చుతాము. దుమ్ము దూళితో కూడి ఉన్నా గాలిని పీల్చక తప్పదు. ప్రత్యామ్నాయ మార్గాలేమీ లేవు. కానీ ఓ కంపెనీ మాత్రం స్వచ్ఛమైన గాలిని అమ్మేస్తుంది.

గాలిని అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే.. అక్కడ గాలిని అమ్మేస్తున్నారు. ఏకంగా డబ్బాల్లో నింపి గాలిని విక్రయిస్తున్నారు. వాటర్ బాటిల్స్ ను కొనుక్కున్నట్టు భవిష్యత్తులో గాలి టిన్నులను కూడా కొనాల్సి వస్తుందేమో అని ఇది తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఈ గాలి టిన్నులను ఎక్కడ అమ్ముతున్నారు. దీని ధర ఎంత? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. విపరీతమైన వాయుకాలుష్యం మానవాళిని కలవరానికి గురిచేస్తుంది. ప్రాణాలు నిలుపుకోవాలంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే స్వచ్ఛమైన గాలిని, ఆక్సీజన్ సిలిండర్లను వెంటపెట్టుకోవాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులనే ఆసరగా చేసుకుని కమ్యూనికా అనే కంపెనీ వినూత్నమైన వ్యాపారానికి తెరలేపింది. ఏకంగా గాలిని ప్యాక్ చేసి అమ్మడం మొదలుపెట్టింది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్. ఇటలీలో గాలిని టిన్నుల్లో ప్యాక్ చేసి విక్రయిస్తోంది. టలీలో లేక్ కోమో అనే సరస్సు ఉన్న ప్రాంతం చాలా స్వచ్ఛంగా, కాలుష్యం లేకుండా ఉంటుంది. ఆ సరస్సు పక్కన ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలి లభిస్తోందనీ.. దాన్ని క్యాన్స్‌లో బంధించి.. దానికి తమ దగ్గర ఉన్న సీక్రెట్ ఫార్ములా గాలిని కూడా కలిపి అమ్ముతున్నామని.. ఆ కంపెనీ చెబుతోంది.

ఆక్సీజన్, నైట్రోజన్ వంటి వాయువులను కలిపి గాలిని విక్రయిస్తున్నట్టు తెలిపింది. స్వచ్ఛమైన గాలి చిన్న టిన్ను ధర రూ. వెయ్యి రూపాయల పైమాటే అని చెబుతున్నారు. టిన్నుల్లోని గాలిని పీల్చితే మీ మూడ్ మారుతుందని.. మనసు తేలిక అవుతుందని చెబుతోంది. కమ్యూనికా అమ్మేటువంటి గాలి టిన్నులు లేక్ కోమో ప్రాంతంలో ఉండే స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గాలి కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. మరి గాలిని టిన్నుల్లో ప్యాక్ చేసి అమ్ముతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments