Krishna Kowshik
Herat Attack.. కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం... రెప్పపాటు జీవితం మనది. ఈ మధ్య కాలంలో అత్యంత చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు.. తాజాగా ఓ యువ క్రీడాకారుడు.. మ్యాచ్ ఆడుతుండగానే..
Herat Attack.. కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం... రెప్పపాటు జీవితం మనది. ఈ మధ్య కాలంలో అత్యంత చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు.. తాజాగా ఓ యువ క్రీడాకారుడు.. మ్యాచ్ ఆడుతుండగానే..
Krishna Kowshik
రెప్పపాటులో ప్రాణాలు హరించేస్తుంది గుండె పోటు. సన్నగా మెలిపెడుతూ.. అమాంతం మనిషిని దెబ్బతీస్తోంది. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి.. మరో సెకనుకు బతికి ఉంటాడన్న నమ్మకాన్ని పోగొడుతుంది హార్ట్ ఎటాక్. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న వ్యత్యాసం లేదు. ఆరోగ్యంతో ఉన్నా లేకపోయినా.. తనకు సంబంధం లేదు. ఒక్కసారిగా వచ్చేసి, కూలబడిపోయేలా చేస్తుంది. వెంటనే ప్రాణాలు తీసేసుకుంటుంది. కరోనా అనంతర పరిస్థితులు ఇందుకు కారణాలు అవుతున్నాయి. కేవలం ఇండియాలోనే ఈ ధోరణి ఉందనుకుంటే పొరపాటు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుండె పోటుతో చిన్న వయస్సులోనే చనిపోతున్నారు కొందరు. తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ 17 ఏళ్లకే గుండె పోటుతో మరణించాడు. అతడి వీడియో చూస్తే.. జీవితం ఇంత చిన్నదా అనిపించకమానదు.
ఇండోనేషియాలో బ్యాడ్మింటన్ టోర్నీ జరుగుతుంది. జూన్ 30న మ్యాచ్ ఆడుతున్నాడు చైనా బ్యాడ్మింటన్ ఆటగాడు జాంగ్ జిజీ. ఒక్కసారిగా ఆడుతుండగానే నేలకొరిగాడు. విలవిలలాడుతూ నేలపై రెండు సార్లు కొట్టుకున్న అతడు.. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడ్ని అంబులెన్సులో సమీప ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స తీసుకుంటుండగా మరణించాడు. ఈ ఘటనపై బ్యాడ్మింటన్ ఆసియా అండ్ ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (పీబీఎస్ఐ) దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. చైనీస్ బ్యాడ్మింటన్ అసోసియేషణ్ (సీబీఏ) అతడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసింది. జాంగ్ నేలపై పడిపోయిన రెండు నిమిషాల్లోనే ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేదకుండా పోయిందని పీబీఎస్ఐ పేర్కొంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. స్కోర్ 11-11 వద్ద ఉండగా..జాంగ్ సర్వీస్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. కాక్ తీసుకుని కోర్టులో ముందుకు వచ్చిన అతడు ఒక్కసారిగా నేలకొరిగాడు. ఈ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. రెప్పపాటులో జరిగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బ్యాడ్మింటన్ క్రీడలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యువ ఆటగాడు.. 17 ఏళ్లకే తనువు చాలించడం ఈ క్రీడా రంగాన్ని కలచివేసింది. జాంగ్ చైనా జాతీయ యువ బ్యాడ్మింటన్ జట్టులో భాగంగా ఉన్నాడు. మార్చిలో నెదర్లాండ్స్‌లో జరిగిన డచ్ జూనియర్ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలిచాడు. ఎంతో రాణిస్తాడు అనుకున్న సమయంలో అర్థంతరంగా తనువు చాలించాడు. ఛాంపియన్‌షిప్‌లలో జూలై 1 మ్యాచ్‌లకు ముందు జాంగ్ కోసం నిమిషం మౌనం పాటించారు. చైనా జట్టు సభ్యులు తమ సహచరుడికి నివాళిగా నల్లటి బ్యాండ్‌లు ధరించారు.
ఇండోనేషియాలో జరిగిన బ్యాడ్మింటిన్ టోర్నీలో ఆడుతూ.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన చైనీస్ బ్యాడ్మింటన్ ఆటగాడు జాంగ్ జిజీ(17). నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
Follow @bigtvtelugu for more updates#Indonesia #badmintonindonesia #ZhangZhiJie #Died #ViralVideo… pic.twitter.com/rjDE98guLD
— BIG TV Breaking News (@bigtvtelugu) July 2, 2024