iDreamPost
android-app
ios-app

లవర్స్‌ని వేధిస్తున్న వింత రోగం! ప్రియుడు ఫోన్ ఎత్తకపోతే.. ఈ జబ్బు వచ్చే ప్రమాదం!

  • Published Apr 24, 2024 | 12:31 PM Updated Updated Apr 24, 2024 | 12:31 PM

Love Brain Disease: ప్రేమికులు అనగానే గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడమే గుర్తుకు వస్తుంది. అయితే తరచుగా లవర్‌కి ఫోన్‌ చేయడం కూడా ఓ జబ్బంట. ఆ వివరాలు..

Love Brain Disease: ప్రేమికులు అనగానే గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడమే గుర్తుకు వస్తుంది. అయితే తరచుగా లవర్‌కి ఫోన్‌ చేయడం కూడా ఓ జబ్బంట. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 12:31 PMUpdated Apr 24, 2024 | 12:31 PM
లవర్స్‌ని వేధిస్తున్న వింత రోగం! ప్రియుడు ఫోన్ ఎత్తకపోతే.. ఈ జబ్బు వచ్చే ప్రమాదం!

ప్రేమలో ఉన్న వారికి లోకం అంత కొత్తగా కనిపిస్తుంది.. ఊహాలోకంలో తేలిపోతుంటారు.. ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా వారి దగ్గరే ఉన్నట్లు భావిస్తారు. ఇక లవ్‌లో పడి జీవితాలు నాశనం చేసుకునే వారు ఎందరు ఉన్నారో.. ప్రేమను దక్కించుకోవడం కోసం కష్టనష్టాలను ఓర్చుకుని.. జీవితంలో సెటిల్‌ అయ్యి.. అడ్డంకులను దాటుకుని ప్రేమను గెలిపించుకునేవారు కూడా ఉన్నారు. ఇక లవర్స్‌ అనగానే గంటలు గంటలు ఫోన్‌లో కబుర్లు చెప్పుకోవడం.. షికార్లకు తిరగడమే గుర్తుకు వస్తుంది. ఇక లవర్స్‌లో కొందరు అతి ప్రేమతో.. భాగస్వామిని ఇబ్బంది పెడతారు. అయితే ఇదంతా ప్రేమే అని అనుకుంటారు. కానీ కాదట.. ఇది ఓ రకమైన జబ్బంట. తాజాగా ఈ తరహా సంఘటన చైనాలో వెలుగు చూసింది. ఆ వివరాలు..

ఓ యువతి వయసు 18 సంవత్సరాలు. ప్రేమలో పడింది. బాయ్‌ఫ్రెండ్‌ అంటే ఆమెకు పిచ్చి. నిత్యం అతడికి కాల్స్‌ చేసేది. అయితే రాను రాను ఆమె ఇష్టం.. అతడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈక్రమంలో ఓ రోజు ప్రియుడికి పదే పదే ఫోన్‌ చేసింది ఆ యువతి. అతడు ఎంతకు కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. దాంతో ఆగ్రహించిన ఆ యువతి.. ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా ధ్వంసం చేసింది. అంతేకాక బిల్డింగ్‌ మీద నుంచి దూకి చనిపోతానని బెదిరిస్తూ ప్రియుడికి మెసేజ్‌లు చేయడమే కాక.. భవనం పైకి ఎక్కి హల్చల్‌ చేసింది.

విషయం తెలుసుకున్న ప్రియుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగారు. యువతిని అదుపులోకి తీసుకుని.. ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల్లో సదరు యువతికి లవ్‌ బ్రెయిన్‌ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. ఇక ఈ అరుదైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సదరు యువతి పేరు గ్జియాయూ(18). కాలేజీ స్టూడెంట్‌. ప్రేమలో పడింది. ఇక కొంత కాలంగా ఆమె తన దృష్టినంతా ప్రియుడి మీదే పెడుతూ వస్తోంది. నిత్యం తనతో మాట్లాడాలని.. అతడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో తనకు చెప్పాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఆమె అతి ప్రేమతో విసిగిపోయిన ఆ యువకుడు ప్రియురాలికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజు గ్జియాయూ.. తన బాయ్‌ఫ్రెండ్‌కు వందకు పైగా కాల్స్‌ చేసింది. ఆ యువకుడు సమాధానం ఇవ్వలేదు. అతడిని బెదిరిస్తూ అనేక మెసేజ్‌లు పంపింది.

A new disease for lovers 3

ఇక ప్రియురాలి తీరు మీద అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించిన పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్‌ బ్రెయిన్‌ అనే వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ జబ్బు గురించి మెడికల్‌ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించదు అంటున్నారు డాక్టర్లు. కానీ బార్డర్‌ లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఇదొక భాగమని చెబుతున్నారు. సదరు చైనా యువతి కూడా ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతుందని వారు తెలిపారు. దాంతో ప్రస్తుతం లవ్‌ బ్రెయిన్‌ వ్యాధిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ వ్యాధి ఎవరికి సోకుతుందంటే..

ప్రేమలో, రొమాంటిక్‌ రిలేషన్స్‌లో ఉన్నవాళ్లే ఈ లవ్‌ బ్రెయిన్‌ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడంతో పాటు.. ఎదుటి వారి గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్‌ బ్రెయిన్‌ వ్యాధిలోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోయేవారు దీని బారిన పడుతున్నారు. ఇది బార్డర్‌లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్‌ డిజార్డర్‌​ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కారణాలు..

లవ్‌ బ్రెయిన్‌ ఎక్కువ కేసుల ఆధారంగా చూస్తే.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలోనే ఆప్యాయత, అనురాగాలు దొరక్క.. మానసిక సంఘర్షణకు లోనైనవారే.. ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు. అయితే మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈవ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉందని.. అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.