iDreamPost
android-app
ios-app

కారుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్

ఇటీవల తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే టెక్నికల్ ఇబ్బందులు రావడంతో పైలెట్స్ సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.. కొన్నిసార్లు గాల్లోనే ప్రమాదాలకు గురి అవుతున్నాయి.

ఇటీవల తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే టెక్నికల్ ఇబ్బందులు రావడంతో పైలెట్స్ సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.. కొన్నిసార్లు గాల్లోనే ప్రమాదాలకు గురి అవుతున్నాయి.

కారుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్

మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇటీవల విమాన ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాల కారణం, ఒక్కసారే వాతావరణంలో మార్పు, పక్షులు ఢీ కొనడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి పైలెట్లు సురక్షితంగా ల్యాండిగ్ చేస్తూ వందల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్నిసార్లు గాల్లో ఉండగానే ప్రమాదాలకు గరై ఎంతోమంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఓ విమానం ప్రమాద వశాత్తు రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

చిలీ దేశంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపు తప్పి విద్యుత్ స్తంబానికి ఢీ కొట్టడంతో మంటలు వ్యాపించాయి. చిలీలోని పంగులేమో విమానాశ్రయం.. తల్కాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమాన శకలాలు ఓ కారుపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐరెస్ టర్బో ట్రష్ విమానం జనవరి 15న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గాల్లోకి ఎగిరి నియంత్రణ కోల్పోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ విద్యుత్ స్తంబానికి ఢీ కొట్టి మంటలు చెలరేగాయి. అదుపు తప్పి పక్కనే రహదారిపై వెళ్తున్న కారుపై పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలను స్థానికులు అదుపు చేసేందుకు యత్నించారు.

చిలీలోని తాల్కాలోని జరిగిన విమాన ప్రమాదం గురించి చిలీ వ్యవసాయ మంత్రిత్వం శాఖ పైలట్ చనిపోయిన విషయాన్ని ధృవీకరించింది. మృతుడు నేషనల్ ఫారెస్ట్రీ కార్పోరేషన్ లో పైలట్ గా పనిచేస్తున్నఫెర్నాండో సోలన్స్ రోబుల్స్ అని తెలిపారు. ఈ ఫైటర్ విమానాన్ని ఫైర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది. అయితే మృతి చెందిన పైలట్ కి అపార అనుభవం ఉందని.. ఈ ప్రమాదం అసలు ఎలా జరిగిందో అర్థం కావడం లేదని CONAF ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఒకరు అన్నారు. ఆండీస్ స్పా కంపెనీ ఎయిర్ లైన్స్ ఈ విమానాన్ని నడుపుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో విపరీతమైన మంటలు, దట్టంగా పొగ అల్లుకోవడంతో అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టపడ్డట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి