P Krishna
Woman Carries Foetus: ఏ మహిళ అయినా కడుపులో బిడ్డను తొమ్మిది నెలలు మోస్తుంది.. కానీ ఓ మహిళ విషయంలో విచిత్రం చోటు చేసుకుంది.
Woman Carries Foetus: ఏ మహిళ అయినా కడుపులో బిడ్డను తొమ్మిది నెలలు మోస్తుంది.. కానీ ఓ మహిళ విషయంలో విచిత్రం చోటు చేసుకుంది.
P Krishna
సాధారణంగా మహిళలు తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మోసి పండంటి బిడ్డకు జన్మనిస్తుంటారు. కొంతమంది 9 నెలలు దాటిన తర్వాత కూడా బిడ్డకు జన్మనిస్తుంటారు.. ఇవి చాలా అరుదుగా జరిగే కేసులు. కానీ ఓ మహిళ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 ఏళ్ల పాటు తన కడుపులో చనిపోయిన పిండాన్ని మోసింది. విచిత్రం ఏంటంటే తన కడుపులో ఓ పిండం ఉందన్న విషయం ఆ మహిళకు కూడా తెలియదు. ఇటీవల కడుపు నొప్పి కారణంగా హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేసి చూసే ఈ విచిత్ర అనుభవం ఆ మహిళలకు ఎదురైంది. ఆమెకే కాదు వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..
డానియేలా వెరా (81) అనే మహిళ ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. కొన్ని మందులు ఇచ్చి పంపించారు వైద్యులు. మరో రెండు రోజుల తర్వాత అదే ఇబ్బందితో డానియేలా ఆస్పత్రికి వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆమెకు 3డి స్కానింగ్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే ఆ పిండం ఎప్పుడో మరణించిందని.. గడ్డకట్టుకుపోయిందని (కాల్సిఫికేషన్) అని వైద్యులు తెలిపారు. ఇటీవల ఆమె పరాగ్వా సరిహద్దు మీదుగా స్వదేశానికి వస్తున్న సమయంలో హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించింది. ఈ క్రమంలోనే ఆమె కడుపులో చనిపోయిన పిండం ఉందన్న విషయాన్ని డాక్టర్లు బయట పెట్టారు.
మెడిసన్స్ ఇచ్చినప్పటికీ డానియేలా వెరా పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో ఆ పిండాన్ని తొలగించాలని కుటుంబ సభ్యులకు తెలిపారు డాక్టర్లు. కటుంబ సభ్యులు అంగీకారంతో డానియేలా వెరా ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. అయితే డానియేలా వెరా ఇన్ఫెక్షన్ భారిన పడి మృతి చెందింది. అప్పటికే ఆమెకు ఏడుగురు సంతానం. సాధారణంగా ఎక్టోపిక్ ప్రెగ్నిన్సీ కలిగిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని డాక్టర్లు వివరించారు. గర్భసంచి ఆవల పిండం రూపుదిద్దుకుంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో పిండం ఎక్కువ కాలం మనలేక మృతి చెందినపుడు ఇలా జరుగుతుందని డాక్టర్లు వివరించారు.