Arjun Suravaram
Binance Founder Changpeng Zhao: సాధారణంగా వర్డల్ నెంబర్ వన్ రిచెస్ట్ మెన్ ఎవరు, ఆ తరువాత ఉన్న వాళ్లు ఎవరు అనే విషయాలు మాత్రమే తెలుసుకుంటాము. కానీ ఖైదీల్లో కూడా అత్యంత ధనవంతులు ఉంటారని మనకు తెలియదు.
Binance Founder Changpeng Zhao: సాధారణంగా వర్డల్ నెంబర్ వన్ రిచెస్ట్ మెన్ ఎవరు, ఆ తరువాత ఉన్న వాళ్లు ఎవరు అనే విషయాలు మాత్రమే తెలుసుకుంటాము. కానీ ఖైదీల్లో కూడా అత్యంత ధనవంతులు ఉంటారని మనకు తెలియదు.
Arjun Suravaram
ప్రపంచంలోని ధనవంతుల గురించి తరచూ అనే వార్తలు వింటూనే ఉంటాయి. ఏటా అత్యంత ధనవంతులకు సంబంధంచిన జాబితా విడుదల అవుతుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కుబేరుల గురించి మనం వార్తల్లో చదివే ఉంటాము. వారు చేస్తున్న బిజినెస్ ఇతర వ్యవహారల గురించి తెలుసుకునే ప్రయత్నంచ చేస్తుంటారు. ఈ సంగతి ఇలా ఉంటే.. ఖైదీల్లోనూ ధనవంతులు ఉంటారని, అత్యంత కుబేరులు కూడా ఉంటారని తెలుసా?. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ఖైదీ ఒకరు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు. మరి.. ఆ కుబేర ఖైదీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా వర్డల్ నెంబర్ వన్ రిచెస్ట్ మెన్ ఎవరు, ఆ తరువాత ఉన్న వాళ్లు ఎవరు అనే విషయాలు మాత్రమే తెలుసుకుంటాము. కానీ ఖైదీల్లో కూడా అత్యంత ధనవంతులు ఉంటారని మనకు తెలియదు. మరి ఖైదీల్లోనూ అత్యంత కుబేరడు ఎవరో ఇప్పుడు చూద్దాము. ప్రపంచలో అత్యంత ధనవంతుడైన ఖైధీ చాంగ్ జావో అనే 47 ఏళ్ల వ్యక్తి. ఈయన ఎవరో కాదు క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు. మనీల్యాండరింగ్ వంటి పలు కేసుల్లో జావో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అమెరికాలో మనీలాండరింగ్ నిరోధక, మరో కేసులో గతేడాది అక్కడి కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో చాంగ్ జావోకు కోర్టు 4 నెలల జైళ్లు శిక్ష విధించింది.
క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్‌ను 2017లో జావో స్థాపించారు. అతి తక్కువ సమయంలోనే కోట్ల లాభాలను అర్జించాడు. క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌లను నడపుతూ ప్రపంచవ్యాప్తంగా బినాన్స్ కార్యకలాపాలు సాగించాడు. అమెరికా అధికారులతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా బినాన్స్ సీఈఓ బాధ్యతల నుంచి ఆయన జావో వైదొలిగారు. అయినప్పటికీ, ఆయనకు సంస్థలో 90 శాతం వాటా ఉంది. ఇక బ్లూంబర్గ్ సంస్థ అంచనా ప్రకారం.. జావో సంపద విలువ సుమారు 33 బిలియన్ డాలర్లు ఉంది. ఇది మన కరెన్సీలో సుమారు. రూ.3.60 లక్షల కోట్లు ఉంది. ప్రపంచ మార్కెట్‌లో క్రిప్టో కరెన్సీ ప్రభావం బాగా తగ్గిపోయింది.
దీంతో ఆ సంస్థ నష్టాల్లోకి జారుకుంది. ఆ క్రమంలోనే ప్రభుత్వ ఆంక్షల చట్టాలను జావో ఉల్లంఘించిన విషయం బయటకు వచ్చింది. అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం ఖాతాదారుల నిధుల నుంచి బిలియన్ డాలర్లు అక్రమంగా తీసుకున్నట్లు విచారణలో వెలడైంది. దీంతో కోర్టు జావోను దోషిగా నిర్దారించి.. నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 4.3 బిలియన్ డాలర్లు జరిమానాను కూడా విధించింది. జైల్లో ఉన్న జావో.. ఖైదీగా ఉన్న వారిలో అత్యంత ధనవంతుడిగా రికార్డులోకి ఎక్కారు. మరి.. ఈ ఖైదీ ధనవంతుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.