Venkateswarlu
Venkateswarlu
నల్లుల గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడంటే.. నల్లుల బెడద లేదు కానీ, ఒకప్పుడు దారుణంగా ఉండేది. బెడ్‌షీట్లు, దిండ్లలో నక్కి జనాల్ని నిద్రపోనివ్వకుండా చేసేవి. మనుషుల రక్తం పీల్చి హింసించేవి. కాలంతో పాటు వాటి బెడద తగ్గింది. అయితే, కొన్ని ప్రదేశాల్లో మాత్రం అప్పుడప్పుడు నల్లులు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలోని పారిస్ నగరం నల్లుల బారిన పడింది. అక్కడ నల్లులు పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నాయి.
నల్లుల కారణంగా జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. హోటళ్లలో.. రెస్టారెంట్లలో.. రైళ్లలో.. ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో నల్లుల సంఖ్య విపరీతంగా ఉంది. పెద్ద సంఖ్యలో సంచరిస్తూ ఉన్నాయి. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. వాటి కాట్ల బారిన పడి అల్లాడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను చెప్పుకుంటున్నారు. రైలులో ప్రయాణిస్తుండగా నల్లులు కుంటాయంటూ స్పూకీ ఆరా అనే ట్విటర్ ఖాతాదారుడు పేర్కొన్నాడు.
‘‘ నల్లుల బెడద తప్పాలంటే పారిస్‌లో లాక్‌డౌన్ విధించాలి. నగరం నిండా నల్లులు సంఖ్య పెరిగిపోయింది’’.. ‘‘ నల్లుల బెడద గురించి తెలిసింది. అందుకే ఇటలీలోని పారిస్ ట్రిప్‌ను నేను కాన్సిల్ చేసుకున్నాను. అక్కడికి వెళ్లాలంటే నాక్కూడా భయంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, మరికొన్ని నెలల్లో ప్యాషన్ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో.. ఇలా పారిస్ నల్లుల గుప్పిట్లోకి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.ల మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
paris needs to be put on lockdown im so sorry bc wdym city wide bed bug infestation….also during fashion week so people are probably gonna bring it back to their local countries pic.twitter.com/uQKdnxTeGn
— cay (@koralinadean) October 2, 2023