P Krishna
P Krishna
మనిషికి ప్రమాదాలు ఏ రకంగా ముంచుకు వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఇటీవల చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్న విషయం తెలిసిందే. వయసు తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఇక ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించి పదుల నుంచి వందల సంఖ్యల్లో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు ఎంతోమంది మరణిస్తున్నారు. తాజాగా వియత్నాం రాజధాని హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కొకొని ఇప్పటి వరకు 50 మందికి పైగా సజీవ దహనం అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వియత్నంలోని రాజధాని హనోయ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 10 అంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదట పార్కింగ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగినట్లు వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. ఈ అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యల్లో గాయపడ్డారని.. ఇప్పటి వరకు 50 మంది సజీవదహనం అయ్యారు. మరో 54 మంది వరకు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రిస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదం ఎలా సంభవించిందన్న విషయంపై పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు 70 మందిని సురక్షితంగా రక్షించారని అధికారులు తెలిపారు. అయితే ఇది చాలా పెద్ద అగ్ని ప్రమాదం అని ఏజెన్సీ తెలిపింది. అపార్ట్ మెంట్ లో దాదాపు 45 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే చాలమంది ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంభవించిన వ్యూజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
JUST IN: “Dozens” killed in apartment building fire in Hanoi, Vietnam, according to state media pic.twitter.com/uv3NQA3L5S
— BNO News (@BNONews) September 13, 2023