ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్‌ హస్తం? సంచలన విషయాలు

Ebrahim Raisi, Israel, Mossad, Helicopter Crash: ఇరాన్‌ అధ్యక్షుడు హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోలేదని.. అతన్ని ఒక పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక ఇజ్రాయెల్‌ ఉందని అంటున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Ebrahim Raisi, Israel, Mossad, Helicopter Crash: ఇరాన్‌ అధ్యక్షుడు హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోలేదని.. అతన్ని ఒక పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక ఇజ్రాయెల్‌ ఉందని అంటున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మూడు హెలికాప్టర్ల కాన్వాయ్‌తో తూర్పు అజర్‌బైజాన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఇది ప్రమాదం కాదని.. హత్య అంటూ సోషల్‌ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ కుట్ర చేసి రైసీని హత్య చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న అమానుష దాడులను అడ్డుకునేందుకు ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడికి పాల్పడింది. దానికి ప్రతిగా.. ఇరాన్‌ అధ్యక్షుడిని ఇజ్రాయెల్‌ హతమార్చిందని నెటిజన్లు అంటున్నారు. అంతరిక్ష లేజర్‌ ఆయుధాన్ని వాడి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను కూల్చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇరాన్‌ అణు శాస్త్ర వేత్త మొహసీన్‌ ఫక్రిజాద హత్యలో ఇజ్రాయెల్‌ అత్యాధునిక రోబోలను వాడినట్లు తేలింది. అలాగే అణు కేంద్రంలో పరికరాల ధ్వంసంలో కూడా ఇజ్రాయెల్‌ ఇలా విధానాన్నే అవలంభించింది. ఇప్పుడు రైసీని అలాంటి అత్యధునిక టెక్నాలజీ వాడి హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని సోషల్‌ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక.. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ హస్తం కచ్చితంగా ఉందని కొంతమంది నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఇరాన్‌తో పాటు గతంలో తమ శత్రుదేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర మొస్సాద్‌కు ఉందని అంటున్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం వేళ.. సిరియాలో ఇరాన్‌కు చెందిన జనరల్‌ను నెతన్యాహు సైన్యం హత్య చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్లతో దాడి చేసింది. తమ దేశంపై డ్రోన్ల దాడికి పాల్పడిన కారణంగానే ఇప్పుడు ఇరాన్‌ అధ్యక్షుడిని హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. దీనిపై ఇరాన్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే అమెరికా కూడా ఇందులో కుట్ర కోణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడలేదని స్పష్టం చేసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments