రియల్‌ బిచ్చగాడు.. రూ.40 వేల కోట్ల ఆస్తులు వదిలి.. భిక్షమెత్తుకుంటున్న శ్రీమంతుడు!

విజయ్‌ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా గుర్తుందా. వేల కోట్ల ఆస్తికి వారసుడు. కోరుకున్నది ఏదైనా సరే.. క్షణాల్లో కాళ్ల దగ్గరికి వచ్చేంత సంపద. కానీ కన్నతల్లిని బతికించుకోవడానికి ఆ ప్రాణం లేని నోట్లు ఎందుకు పనికిరావని తెలిసి.. తల్లి ప్రాణాల కోసం చిబ్బగాడుగా దీక్ష తీసుకుంటాడు. చివరకు కన్నతల్లిని బతికించుకుంటాడు. మదర్‌ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళ్‌లో తెరకెక్కినా.. తెలుగులో కూడా విడదలయ్యి.. భారీ విజయం సాధించింది. ఇది సినిమా కాబట్టి.. తల్లి ప్రాణం కోసం హీరో వేల కోట్ల రూపాయల ఆస్తులను వదులుకుని.. మండలం రోజులు బిచ్చగాడిగా జీవిస్తాడు. కానీ వాస్తవంలో ఎవరైనా ఇలా చేయగలరా అంటే.. అసాధ్యం అంటాం. కానీ ఇప్పుడు మీరు రియల్‌ బిచ్చగాడి గురించి తెలుసుకోబోతున్నారు. అతడు వేల కోట్ల రూపాయాల ఆస్తులు వదిలి.. భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియాలంటే..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ రిలయ్‌ బిచ్చగాడు ఎవరంటే.. అజన్ సిరిపానో. 18 ఏళ్ల వయసులో తన 40,000 కోట్ల ఆస్తిని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారి 20 ఏళ్లుగా అడవుల్లోనే జీవిస్తున్నాడు అజన్‌ సిరిపన్యో. అతడి తండ్రి శ్రీలంక తమిళ సంతతికి చెందిన టెలికాం వ్యాపారవేత్త ఆనంద్‌ కృష్ణన్‌. వీరు మలేషియాలో స్థిరపడ్డారు. ఆదేశంలో అత్యంత సంపన్నవంతులు జాబితాలో మూడో స్థానంలో నిలుచున్నారంటే.. వారు ఎంత ధనవంతులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణన్ సామ్రాజ్యంలో టెలికాం పరిశ్రమ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ వ్యాపారం ఉన్నాయి. కృష్ణన్‌కు కనీసం 9 ప్రధాన కంపెనీల్లో వాటా ఉంది. ఆనంద్‌ కృష్ణన్‌ టెలికమ్యూనికేషన్స్‌ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. అతడి ఆస్తి సుమారు 40 వేల కోట్ల రూపాయలు.

ఆనంద్‌ కృష్ణ వారసుడే అజన్‌ సిరిపన్యో. వీరు మొదటి నుంచి బౌద్ధ మతాన్ని నమ్మేవారు. దాంతో అజన్‌ తన 18వ ఏటనే బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ వార్త మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వేల కోట్ల రూపాయల ఆస్తులను వదులుకుని.. అజన్‌ సన్యాసం స్వీకరించడం అందరిని ఆశ్చర్యంతో పాటు షాక్‌కి కూడా గురి చేసింది. చాలా మంది అతడు కేవలం సరదా కోసం మాత్రమే సన్యాస జీవితాన్ని స్వీకరించాడు.. త్వరలోనే మాములు జీవితం సాగిస్తాడంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సిరపన్యో మాత్రం తండ్రి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులున్నా.. వాటిని వదులుకుని భిక్షాటన చేస్తూ.. జీవితం సాగిస్తున్నాడు.

అజన్ సిరిపన్యో రెండు దశాబ్దాలకు పైగా అడవులలో సన్యాసి జీవితాన్ని గడిపినట్లు చెబుతారు. అతను థాయ్‌లాండ్‌లోని డేటావో దమ్ మొనాస్టరీకి మఠాధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. అజన్ సిరిపన్యో తల్లి థాయ్‌కు చెందిన రాజవంశానికి చెందిన మహిళ అని నమ్ముతారు. అజన్‌ సిరిపన్యోకు సంబంధించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. ఆయన ఏం చదివాడు.. ఎక్కడ చదివాడు వంటి వివరాలు ఎవరికి తెలియదు. అంతేకాక అతడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నట్లు.. వారు ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. సిరిపన్యోకు ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం ఉందని.. అనర్గళంగా మాట్లాడగలడు.

Show comments