Krishna Kowshik
ఈ కాలంలో అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే.. పెద్దగా కష్టపడనవసరం లేదు పేరెంట్స్. కానీ అబ్బాయిలకు తల కిందుల తపస్సు చేయాల్సి వస్తుంది. కానీ ఆ ఊరి నిండా అందగత్తలే.. సరైన వరుడు దొరక్క బ్రహ్మచారిణిగా బ్రతుకుతున్నారట.
ఈ కాలంలో అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే.. పెద్దగా కష్టపడనవసరం లేదు పేరెంట్స్. కానీ అబ్బాయిలకు తల కిందుల తపస్సు చేయాల్సి వస్తుంది. కానీ ఆ ఊరి నిండా అందగత్తలే.. సరైన వరుడు దొరక్క బ్రహ్మచారిణిగా బ్రతుకుతున్నారట.
Krishna Kowshik
బెండకాయ ముదిరిన, బ్రహ్మచారి ముదిరిన పనికిరావని అంటుంటారు పెద్దలు. దేశంలో ప్రస్తుత మగవాళ్ల పరిస్థితి అలానే ఉంది. ప్రస్తుతం పెళ్లి కానీ ప్రసాదులు ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలకు కాబోయే వరుడి గురించి ఓవర్ ఎక్స్‌ప్టెషన్స్ ఉండటంతో.. రైతులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే అబ్బాయిలకు అసలు పెళ్లి కూతుర్లు దొరకడం లేదు. దీంతో 40 ఏళ్లు వచ్చినా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు అబ్బాయిలు. కుర్రాడు కత్తిలా ఉండకపోయినా పర్లేదు.. సాఫ్ట్ వేర్ లేదా, పెద్ద బిజినెస్, అది కాకుంటే ప్రభుత్వ ఉద్యోగం.. ఇలాంటి మగవాళ్లకే తమ అమ్మాయిల్ని ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడంతో ఈ సమస్య తలెత్తింది. తాము ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామని పోరు పెడుతున్నా.. బాగా చూసుకుంటామని చెబుతున్నా.. మీ పెత్తనం అప్పజెబుతామన్న ససేమీరా అంటున్నారు.
మన దేశంలో ఈ పరిస్థితి నెలకొంటే.. మరో ఊరిలో అమ్మాయిలకు బ్రహ్మచారిణీలుగా మిగిలిపోతున్నారు. పోనీ అందగత్తెలు కాదంటే.. కల్లు చెదిరే సౌందర్యం వారిది. కానీ చాలా మంది ఆడవాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదట. ఇంతకు ఆ ఊరు ఎక్కడ ఉందంటే.. బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బెలోవాలో మున్సిపాలిటీ పరిధిలో ఉంది నోయివా డో కోర్డెరో ఊరు. ఈ ప్రాంతంలో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదు. ఆ ఊరు మొత్తంలో సగం మంది అమ్మాయిలకే పెళ్లిళ్లు అయ్యాయి. మిగిలిన వారు వరుడు కోసం ఎదురుచూస్తున్నారు. పోనీ అందగత్తెలు కారా అంటే బ్యూటీ క్వీన్స్. తాము ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పటికీ.. సరైన జోడు దొరకడం లేదు.
దీనికి కారణం.. కొన్ని కఠినమైన నిబంధనలేనట. ముఖ్యంగా ఈ నిబంధనలు పురుషులకు నచ్చని నియమాలట. తమను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ఆ గ్రామంలోనే ఉంటూ.. గిన్నెలు కడగటం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం, వంట చేయడంలో సాయం చేయాలట.ఇక్కడ అమ్మాయి, అబ్బాయి సమానం అని నమ్ముతున్న నేపథ్యంలో ఈ షరుతులు ఉన్నాయట. ఇక్కడ పెళ్లి కానీ అమ్మాయిలు.. తమకు పెళ్లి కావడం లేదని బాధపడరట. ఇక్కడ అమ్మాయిలు స్వతంత్రలు, ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. తన ఇంటిని పోషించేందుకు ప్రతి పనిని చేస్తారు. ఈ షరతులు నచ్చి, పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఈ కండిషన్స్ ఫాలో కావాల్సిందే. అలాంటి అబ్బాయిల కోసం కీలక ప్రకటన కూడా చేసింది ఆ గ్రామం. నైపుణ్యం, తెలివి తేటలు ఉండి, షరతులకు లోబడి.. ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చునట.
ఆ గ్రామంలోనే ఉంటూ.. భార్యలకు సాయ పడాలనుకునే అబ్బాయిలకు ఇది బంఫర్ ఆఫరే. అయితే ఈ రూల్స్ నచ్చక మగాళ్లు ఈ ఊరి వైపే చూడటం లేదట. ఇంతకు ఈ ఊరికి ఇన్ని వింత కండిషన్లు రావడం వెనుక పెద్ద కథే ఉంది. మారియో సెన్షోరిన్సా అనే మహిళ 1891లో ఓ వ్యక్తిని ప్రేమించి, పెద్దల ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెను ఊరి నుండి బహిష్కరించారు బంధువులు, గ్రామస్థులు. దీంతో మరియా డొ కోర్డెరో గ్రామానికి వచ్చి స్థిర పడిపోయింది. అనంతరం పురుషాధిక్యత లేని సమాజం, ఆడవాళ్లు, మగవాళ్లు సమానత్వం అనే సమజాన్ని ఏర్పాటు చేసి.. సక్సెస్ అయ్యింది. అప్పటి నుండి ఈ నిబంధనలను పెట్టుకుని బ్రతుకుతుంది ఈ ఊరు.