iDreamPost
android-app
ios-app

నూడుల్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. సగం తిన్నాక చూస్తే వింత వస్తువు

మన బద్దకమే మనల్ని రోగుల్ని చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో చేసుకునేందుకు ఓపిక లేకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లి.. నచ్చింది ఆర్డర్ చేస్తుంటారు. శుచి,శుభ్రత పక్కన పెట్టి.. కలర్ ఫుల్ ఆహారానికి జైజైలు కొడుతుంటే.. రెస్టారెంట్స్ నిర్వాకపు పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నాయి.

మన బద్దకమే మనల్ని రోగుల్ని చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో చేసుకునేందుకు ఓపిక లేకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లి.. నచ్చింది ఆర్డర్ చేస్తుంటారు. శుచి,శుభ్రత పక్కన పెట్టి.. కలర్ ఫుల్ ఆహారానికి జైజైలు కొడుతుంటే.. రెస్టారెంట్స్ నిర్వాకపు పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నాయి.

నూడుల్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. సగం తిన్నాక చూస్తే వింత వస్తువు

ఇంట్లో వంట చేసుకోవడానికి బద్దకం వేసిన మహిళలు, బ్యాచులర్స్‌కు ఆపన్న హస్తాలుగా మారాయి.. రెస్టారెంట్స్. ఆకలి వేసినప్పుడు లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు, వంట చేసుకునేందుకు ఓపిక లేనపుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్లి నచ్చింది ఆర్డర్ పెట్టేస్తుంటారు. శుచి, శుభ్రత ఎలా ఉన్నా నలుగురు రకాల ఫుడ్ కలర్ కలిపేసి కలర్ ఫుల్‌గా కనిపించేలా మేక్ చేస్తే చాలు కస్టమర్లు ఎగబడి మరీ తింటుంటారు. స్ట్రీట్ ఫుడ్స్ కన్నా.. రెస్టారెంట్ ఆహారంపై ఉన్న నమ్మకంతో అక్కడ వాలిపోతుంటారు. ఆర్డర్ వచ్చాక ఆవురావురా తిందామని ఈగర్లీ వెయిట్ చేసి.. ఫుడ్ ఓ సారి పరిశీలన చూస్తే తెలుస్తోంది అందులో జంతుజాలం కనిపిస్తోంది. ఎన్ని సార్లు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొలేదు కస్టమర్లు.

బొద్దింకలు, పురుగులు, బల్లులు.. చివరకు ఎలుకలు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కస్టమర్‌కు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ సారి జీవ జాతులు కాదు..ఓ విచిత్ర మైన వస్తువులు కనిపించింది. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా రెస్టారెంట్ల నిర్వాకం బయటకు వచ్చింది. ఇంతకు అది ఏంటంటే..? వివరాల్లోకి వెళితే షాన్ జై అనే వ్యక్తి ఇష్టంగా తిందామని ఓరెస్టారెంట్‌కు వెళ్లి నూడుల్స్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ చేసిన కాసేపటికి వేడి వేడి నూడుల్స్ వచ్చింది. తినేందుకు గిన్నెలో నూడుల్స్ తిప్పుతుంటే.. వింతగా ఏదో కనిపించింది. వెంటనే ఏంటా అని తీసి చూడగా అవాక్కవ్వడం అతని వంతైంది.

ఇంతకు ఆ వస్తువు ఏంటంటే.. బ్యాండ్ ఎయిడ్. ఒంటికి గాయం అయితే వినియోగించే బ్యాండ్ ఎయిడ్ అతడి నూడుల్ పదార్థంలో కనిపించడంతో ఖంగుతిని.. తన ఆవేదనంతా ఫేస్ బుక్‌లో వ్యక్త పరిచాడు. మలేషియాలోని సబాలో ఉన్న రెస్టారెంట్‌కు తన అత్తామాలతో కలిసి వెళ్లానని, రైస్ నూడుల్స్, గ్రిల్డ్ పోర్క్ ఆర్డర్ చేశానని చెప్పాడు. ఆహారం సర్వ్ చేసి కొద్దిగా తినగానే.. లోపల బ్యాండ్ ఎయిడ్ కనిపించింది. అది చూసి షాక్ తిని.. మేనేజర్‌ని ప్రశ్నించగా.. వంట గది వైపు పరుగులు పెట్టాడు. వెంటనే బయటకు వచ్చి షాన్ తింటున్న నూడుల్స్ బౌల్ తీసుకుని క్షమాపణలు చెప్పాడు. ఈ విషయం సీరియస్ కావడంతో రెస్టారెంట్ ఓనర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్రీగా అతడు ఆర్డర్ చేసిన ఆహారాన్ని అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి