iDreamPost
android-app
ios-app

విషాదం: పడవ బోల్తా.. 17 మంది మృతి!

నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ఏకంగా 17 మంది మృతి చెందగా మరో 70 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ఏకంగా 17 మంది మృతి చెందగా మరో 70 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

విషాదం: పడవ బోల్తా.. 17 మంది మృతి!

నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ఏకంగా 17 మంది మృతి చెందగా మరో 70 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే? తారాబా రాష్ట్రంలోని ఆర్టో కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి 100కు పైగా ప్రయాణికులతో పడవ బయలు దేరింది. అయితే తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఈ పడవ బోల్తా పడింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సమాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధిపతి లాడాన్ అయుబా స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని రక్షించి 17 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్ సైతం స్పందించారు. తాజాగా చోటు చేసుకుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.