iDreamPost
android-app
ios-app

13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు!

Pakistan: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల విషయాలో చాలా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి అంటే అర్థం తెలియని పిల్లలకు వివాహం జరిపించి..వారి గొంతు కోస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

Pakistan: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల విషయాలో చాలా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి అంటే అర్థం తెలియని పిల్లలకు వివాహం జరిపించి..వారి గొంతు కోస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఆ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలన  అందరూ భావిస్తుంటారు. అలానే చాలా మంది అమ్మాయి తల్లిదండ్రులు తమ బిడ్డలకు  పెళ్లిళ్లు చేసి.. అత్తారింటికి పంపించాలని ఎంతో ఆతృతగా ఉంటారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు దారుణమైన ఘటనలకు పాల్పడుతుంటారు. మరీ.. పెళ్లి వయస్సు రాని తమ బిడ్డలకు, పెళ్లి అంటే అర్థం తెలియని పిల్లలకు పెళ్లి చేసి..వారి గొంతుకొస్తున్నారు. తాజాగా ఓ 13 ఏళ్ల అమ్మాయికి 70 ఏళ్ల ముసలోడితో వివాహం జరిపించారు. అయితే చివర్లో జరిగిన ట్విస్ట్ తో అందరూ షాకయ్యారు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవల కాలంలో పెళ్లిళ్ల విషయాలో చాలా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి అంటే అర్థం తెలియని పిల్లలకు వివాహం జరిపించి..వారి గొంతు కోస్తున్నారు. చదువుకుంటూ హాయిగా సాగిపోయే కొందరు పిల్లలను పెళ్లిళ్లు చేసి..వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మైనర్ పిల్లలకు పెళ్లిళ్లు చేయడమే దారుణం అంటే.. కొందరు తల్లిదండ్రులు కసాయి వారి కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తమ బిడ్డలను కసాయివాడికి బలిచ్చినట్లు కాటికి కాలు చాపిన ముసలోళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.

పాకిస్థాన్ లో జరిగిన ఈ దారుణ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పాక్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా  ప్రావిన్స్ లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా వివాహం జరిపించారు. పెళ్లి అంతా సవ్యంగా సాగిందని వారు భావిస్తున్న వేళ.. అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్కడ పెళ్లి నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలిక తండ్రి, పెళ్లి చేసుకున్న వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.  వివాహాన్ని జరిపించిన అధికారిని, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అలానే మైనర్ బాలికకు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ దేశంలో వివాహం వయస్సు ఆడపిల్లలకు 16,  అబ్బాయిలకు 18 ఏళ్లుగా ఉంది. వివాహ చట్టం -1929 ప్రకారం అక్కడ వివాహ వయస్సును ఆడవారికి 16, మగవారికి 18గా నిర్ణయించారు. ఆ చట్టాన్ని అతిక్రమించి ఈ వివాహం జరిపించనందుకు..నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పాకిస్థాన్ లో తరచూ జరగుతుంటాయి. పెద్దరికం కారణంగా అమ్మాయిల తల్లిదండ్రులు డబ్బుల కోసం ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటారు. మరి.. ఈ ఘోరమైన ఘటనకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.