Somesekhar
dinosaur bones display at Mupa Museum in Spain: 7.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ ఎముకలను మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు. ఇక ఈ పురాతన డైనోసార్ ఎముకలను చూసేందుకు పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
dinosaur bones display at Mupa Museum in Spain: 7.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ ఎముకలను మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు. ఇక ఈ పురాతన డైనోసార్ ఎముకలను చూసేందుకు పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Somesekhar
ఈ భూమిపై రకరకాల జంతువులు ఉన్నాయి. అయితే వాటన్నింటిలోకి ప్రత్యేకమైన జంతువుగా డైనోసార్ పేరొందింది. దీన్నే రాక్షసబల్లి అని కూడా పిలుస్తారు. ఇక ఈ డైనోసార్లు భూమ్మిద కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. తాజాగా 7.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ ఎముకలను మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు. ఇక ఈ పురాతన డైనోసార్ ఎముకలను చూసేందుకు పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ 7.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ ఎముకలు ఎప్పుడు దొరికాయి? ఏ మ్యూజియంలో ఉంచారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
7.5 కోట్ల ఏళ్ల నాటి క్రితం ఈ భూమిపై జీవించిన డైనోసార్ అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ రాక్షలబల్లికి సంబంధించిన ఎముకలను స్పెయిన్ లోని చరిత్రాత్మాక క్విన్ కో నగరంలోని ముపా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. దాంతో ఈ పురాతన డైనోసార్ ఎముకలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అవశేషాలను 2007లో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 2007లో ఫ్యూయంటస్ గ్రామంలో మాడ్రిడ్-అలీకంటే ప్రాంతాల మధ్య హైస్పీడ్ రైలు లింకులను ఏర్పాటు చేసే క్రమంలో ఈ డైనోసార్ శిలాజాలు అనూహ్యంగా బయటపడ్డాయి. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం కొండను తవ్వుతుండగా.. ఓ కార్మికుడు వీటిని గుర్తించాడు. అయితే తొలుత ఈ ఎముకలను చూసి.. మనిషివి అనుకున్నారు. ఆ తర్వాత ఓ పురావస్తు అధికారికి వీటిని చూపించగా.. అవి జంతువు బోన్స్ అని తెలిపాడు.
ఎప్పుడైతే ఆ ఎముకలు జంతువులవి అని తెలియడంతో శిలాజాల వేట మెుదలైంది. ఏకంగా 50 పాలియోంటాలజిస్టులు అవశేషాలను వెలికితీసే పనిలో పడ్డారు. పెద్ద పెద్ద యంత్రాల సాయంతో.. ఆరు నెలల పాటు కష్టపడి 14 వేల ఎముకలను సేకరించారు. పలు పరిశోధనలు చేసి దాన్ని కుంకాసౌర జాతికి చెందిన డైనోసార్ గా గుర్తించారు. ప్రస్తుతం వాటినే ముపా మ్యూజియంలో సందర్శనకు ఉంచారు. డైనోసార్ ఊహా చిత్రాన్ని ఏర్పాటు చేసి, దాని విశేషాలను సందర్శకులకు వివరిస్తున్నారు. అయితే అన్ని ఎముకలు దొరకకపోవడంతో.. వాటిని ఎముకల గూడుగా ఏర్పాటు చేయలేకపోయామని సైంటిస్టులు తెలిపారు.
ఇక ఈ కుంకాసౌర జాతికి చెందిన డైనోసార్లు ఆహారం కోసం ఎక్కువగా చెట్లపై ఆధారపడేవని, ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న చెట్ల నుంచి ఆహారాన్ని సేకరించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇవి 15 నుంచి 20 మీటర్ల పొడవు ఉండేవని, 15 టన్నుల వరకు బరువును కలిగి ఉండేవని సైంటిస్టులు వివరించారు. ఇక ఐరూపాలో దొరికిన డైనోసార్ల అవశేషాల కంటే ఇవి భిన్నంగా ఉన్నట్లు, వాటిలాగే ఇవి కూడా భారీ పరిమాణంలో ఉండేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక ముపా మ్యూజియంలో ఇప్పటికే పలు జాతులకు చెందిన డైనోసర్ల అవశేషాలు ఉన్నాయి. కానీ ఈ కుంకాసౌర జాతికి చెందిన డైనోసార్ ఎముకలు మ్యూజియంలో ప్రత్యేకంగా నిలిచాయి.