Swetha
ఇద్దరికీ వివాహం చేసేటపుడు పెద్దవారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే వయస్సు బేధం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆఫ్రికాలో జరిగిని ఓ వివాహ సంఘటన గురించి వింటే మాత్రం నోటి మీద వేలు వేసుకోవాల్సిందే.
ఇద్దరికీ వివాహం చేసేటపుడు పెద్దవారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే వయస్సు బేధం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆఫ్రికాలో జరిగిని ఓ వివాహ సంఘటన గురించి వింటే మాత్రం నోటి మీద వేలు వేసుకోవాల్సిందే.
Swetha
సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం .. వివాహ బంధానికి కొన్ని కట్టు బాట్లు, ఆచారాలు ఉన్నాయి. ఇద్దరికీ వివాహం చేసేటపుడు పెద్దవారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమ వివాహాల విషయానికొస్తే అది వారి వ్యక్తిగత విషయం. ఇక గతంలో అయితే బాల్య వివాహాలు చేసేవారు కానీ.. మారుతున్న కాలం ప్రకారం బాల్య వివాహాలు అంతరించిపోయాయి. సాదారణంగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎన్నో పెళ్లి వేడుకలను చూసి ఉంటాము. కొన్ని కొన్ని వీడియోలు ఎంతో సరదాగా.. చూడముచ్చటగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు, ఫోటోలు మాత్రం ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్న జంట మధ్య వయస్సు భేదం ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగా వధూ వరుల మధ్య వయస్సు భేదం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం.. నాలు నుంచి ఐదు పదుల పైనే వయస్సు భేదం కనిపిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా అదే నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో జరిగింది. విషయం ఏంటంటే.. ఒక 63 ఏళ్ళ వృద్ధుడు.. నుమో బోర్కెట్ లావే త్సురు అనే12 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పైగా ఆ అమ్మాయికి ఆరేళ్ళ వయస్సున్నపుడే వీరి వివాహం నిశ్చయించారట. అంతే కాకుండా దీనికి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. ఈ వివాహానికి ఎంతో మంది జనం కూడా హాజరయ్యారు. అంటే ఈ వివాహాన్ని రద్దు చేయడానికి అక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. ఇది అందరి ఇష్టప్రకారం జరిగినట్లుగా అర్ధం అవుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో.. నెటిజన్లు ఈ ఘటనపై గట్టిగానే స్పదింస్తున్నారు. ఈ వివాహం చేయడం చట్ట రీత్యా నేరం అని.. దీనిని అందరు తీవ్రంగా ఖండించాలని కామెంట్స్ చేస్తున్నారు. అందరు కూడా దీనిపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ వివాహం గురించి బయటకు రావడంతో.. ఈ వివాహాన్ని రద్దు చేసి.. వెంటనే.. తసూరుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఘనాలో బాల్య వివాహాన్ని నేరంగా పరిగణిస్తారని, అలాంటి వివాహం జరగదని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ దేశంలో చాలా తప్పులు జరుగుతాయిని, వాటిలో ఇది ఒకటి అని మరొకరు కామెంట్ చేశారు. కాలం ఇంత మారుతున్నా కూడా.. ఇలాంటి పెళ్లిళ్లు ఎలా చేసుకుంటున్నారు అంటూ .. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.