iDreamPost
android-app
ios-app

అక్కడి ఆలయంలో బయటపడ్డ నిధి! పురావస్తు వారికే కళ్లు బైర్లు..

Old Coin Stash: భూమి అనేది కొన్ని వేల సంవత్సరా క్రితం ఉద్భవించింది. ఆ తరువాత ఎంతో మంది పూర్వికులు భూమి మీద తమ జీవనం సాగించారు. ఈ క్రమంలో భూమి లోపల ఎన్నో విలువైన నిధులు నిక్షేపం అయ్యి ఉంటాయి. తాజాగా 2000 ఏళ్ల నాటి విలువైన నిధి బయట పడింది.

Old Coin Stash: భూమి అనేది కొన్ని వేల సంవత్సరా క్రితం ఉద్భవించింది. ఆ తరువాత ఎంతో మంది పూర్వికులు భూమి మీద తమ జీవనం సాగించారు. ఈ క్రమంలో భూమి లోపల ఎన్నో విలువైన నిధులు నిక్షేపం అయ్యి ఉంటాయి. తాజాగా 2000 ఏళ్ల నాటి విలువైన నిధి బయట పడింది.

అక్కడి ఆలయంలో బయటపడ్డ నిధి! పురావస్తు వారికే కళ్లు బైర్లు..

పురాతన కాలం నాటి వస్తువులు, నిధులు వంటివి  భూమిలో నిక్షేపం అయ్యి ఉంటాయి. తరచూ తవ్వకాల్లో ఆ నిధులు బయటపడతుంటాయి. ఇప్పటికే ఎన్నో విలువ నిధులు, ఇతర అరుదైన వస్తువులు పురాతన తవ్వకాల్లో బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా చాలా అరుదైన 2000 ఏళ్ల నాటి నాణేల నిధి  దొరికింది. ఆ నిధిలను చూసిన పురావస్తు శాస్త్ర వేత్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నిధులు ఓ బౌద్ధ దేవాలయ శిధిలాలలో కనుగొన్నారు. మరి.. ఈ నిధికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భూమి అనేది కొన్ని ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఏన్నో  తరాలు గడిచిపోయి. రాజులు, వారి కంటే పూర్వం మరెంతో మందికి సంబంధించిన భూమిలోపల అనేక సంపదలు, పురావస్తు కళాఖండాలు దాగివున్నాయనేది వాస్తవం. అందుకు నిదర్శనంగానే తరచుగా పురావస్తు తవ్వకాలలో అనేన విలువైన వజ్రాలు, బంగారం వంటి నిక్షేపాలు బయటపడుతున్నాయి. అంతేకాక ఏళ్ల నాటి అరుదైన వస్తువులు కూడా మనకు కనిపిస్తుంటాయి.

ఇక నిధుల విషయానికి వస్తే… ఇవి కొన్నిసార్లు పురావస్తు తవ్వకాల్లో, మరికొన్ని సందర్భాల్లో సముద్రంలో మునిగిపోయి.. పరిశోధకుల శోధనలో బయట పడుతుంటాయి. ఇలాంటి పరిశోధన సమయంలో కొన్ని సార్లు.. విలువైన బంగారం, వజ్రాలు, ఇతర నాణేలు వంటివి కూడా అనేకం కనిపించాయి. వాటికి సంబంధించిన కథనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కుషానుల కాలం నాటి గొప్ప నిధి పాకిస్థాన్‌లో బయటపడినట్టుగా వచ్చిన వార్త చర్చనీయంగా మారింది.

దాయాదీ దేశమైన పాకిస్తాన్ లో చాలా అరుదైన 2వేల ఏళ్ల నాటి నాణేల నిధి దొరికింది. ఇక్కడ లభించిన నిధిలో చాలా నాణేలు రాగితో తయారు చేయబడినట్లుగా గుర్తించారు. ఇవి  ఒక పూరతన బౌద్ధ దేవాలయ శిధిలాల్లో కనుగొన్నారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం..ఈ నిధి ఆగ్నేయ పాకిస్తాన్‌లోని మొహెంజో దారో విస్తారమైన శిథిలాల మధ్య ఉందని తెలిసింది. ఇది సుమారు 2600 బీసీ నాటిదని తెలుస్తోంది.

ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త షేక్ జావేద్ అలీ  సింధీ ఈ నిధి గురించి తెలియజేశారు. ఇది మొహంజొదార్ రాజ్యం పతనం తరువాత కూడా సుమారు 1600 ఏళ్ల నాటిదని పేర్కొన్నారు. తాజా త్రవ్వకాలలో ఈ నాణేల నిధిని కనుగొన్న బృందంలో షేక్ జావేద్ కూడా ఒక సభ్యులు. ఈ దొరికిన నాణేలు పూర్తిగా ఆకుపచ్చగా ఉంది. కారణం.. రాగి గాలిని తాకిన తర్వాత రంగు మారుతుందని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాలుగా పాతిపెట్టిన కారణంగా ఈ నాణేలు వృత్తాకారంగా ఓ కుప్పగా మారిందని తెలిపారు.ఈ నిధి బరువు సుమారు 5.5 కిలోలు ఉంటుందని వివరించారు. ఈ నిధిని చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు బైర్లు కమ్మేసినట్టుగా అయింది. మరి..పూరాతన నిధిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.