Swetha
ప్రపంచంలో ధనవంతులంటే అందరికి గుర్తొచ్చేది.. అంబానీ ఆదానీలే. అయితే, వారి వయస్సు నాలుగు పదుల పైగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో బిలినియర్ గా రికార్డు సృష్టించింది 19 ఏళ్ళ అమ్మాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచంలో ధనవంతులంటే అందరికి గుర్తొచ్చేది.. అంబానీ ఆదానీలే. అయితే, వారి వయస్సు నాలుగు పదుల పైగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో బిలినియర్ గా రికార్డు సృష్టించింది 19 ఏళ్ళ అమ్మాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Swetha
సాధారణంగా ఎవరికైనా 19ఏళ్ళ వయస్సులో చదువు తప్ప మరొక ప్రపంచం ఉండదు. కొంతమంది మాత్రం కుటుంబం కోసమో.. లేదాయే ఇతర కారణాల వలన డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఆ వయస్సులో డబ్బు సంపాదన అంటే వేళల్లో ఉంటుంది. లేదా మహా అయితే లక్షల్లో ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి మాత్రం.. 19 ఏళ్ళ వయస్సులోనే బిలినియర్స్ లిస్ట్ లో చేరిపోయి.. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సు బిలినియర్ గా రికార్డు సృష్టించింది. కాలేజీ స్టూడెంట్ గా ఉన్న సమయంలోనే.. ఆమె వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్‌గా మారడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆమె వైపే ఉంది.19 ఏళ్ళ అమ్మాయి బిలినియర్ అవ్వడం ఏంటి అని అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి, ఈ యంగ్ బిలినియర్ గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.
ప్రతిసారి ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన జాబితాను విడుదల చేస్తుంటది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ప్రకటించిన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2024లో.. బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల ఓ కాలేజ్ స్టూడెంట్ .. వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్ గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే, ఇప్పటి వరకు యంగెస్ట్ బిలియనీర్‌గా ఇటలీకి చెందిన యువకుడు.. క్లెమెంటే డెల్ వెచియోను ఉన్నాడు. ఇప్పుడు ఈ యంగ్ లేడీ అతనిని వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే వీరిద్దరి మధ్య వయస్సు బేధం కూడా అంత ఎక్కువ ఏమి లేదు. కేవలం వీరిద్దరికి రెండు నెలలు మాత్రమే వయస్సు భేదం ఉంది. ఈ లేడీ యంగ్ బిలినియర్ మరెవరో కాదు బ్రెజిల్‌కు చెందిన విద్యార్థిని లివియా వోయిగ్ట్. ఈమె అమెరికాకు చెందిన.. ఒక ఎలక్ట్రికల్ మోటార్స్ తయారీదారులలో ఒకరికి.. వారసురాలు. ఆమె తాత వెర్నెర్ రిచార్డో వోయిగ్ట్ స్థాపించిన ఎలక్ట్రికల్ మోటార్స్ కంపెనీ.. డబ్ల్యూఈజీ లో ఈమెకు భారీ వాటా ఉంది.
దీనితో ఆమె చిన్న వయస్సులోనే.. బిలినియర్ గా పేరొంది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె కేవలం సంపదతోనే కాకుండా.. చదువులో కూడా.. ముందుగానే ఉంటుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆమె ప్రస్తుతం ఒక యూనివర్సిటీ స్టూడెంట్ . ఆమె సంపద 1.1 బిలియన్ డాలర్లుగా కొనసాగుతోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.9 వేల కోట్లకుపైగా ఉంటుంది. ఇక ఆమె తన చదువు పూర్తైన తర్వాత.. త్వరలోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈమె కంటే ముందు యంగ్ బిలినియర్ లో ఒకడిగా నిలిచిన క్లెమెంటే డెల్ వెచియో .. రెండవ స్థానానికి వచ్చేశాడు. ఇక ఇండియా నుంచి యంగెస్ట్ బిలియనీర్ల లిస్ట్ లో జెరోధా ఫౌండర్స్ నితిన్ కామత్, నిఖిల్ కామత్, సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ నిలిచారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.