iDreamPost
android-app
ios-app

పిల్లల ఆకలి తీర్చేందుకు ఇంగ్లీష్ ఛానల్ ఈదిన 16 ఏళ్ల అమ్మాయి!

English Channel: రదాగా జీవితాన్ని గడపాల్సిన వయస్సులో కొందరు యువత సమాజ సేవ చేస్తుంటారు. కొందరు అయితే పేదలకు డబ్బులు సమకూర్చేందుకు సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఓ 16 ఏళ్ల యువతి కూడా పిల్లల ఆకలి తీర్చేందుకు సాహసం చేసింది.

English Channel: రదాగా జీవితాన్ని గడపాల్సిన వయస్సులో కొందరు యువత సమాజ సేవ చేస్తుంటారు. కొందరు అయితే పేదలకు డబ్బులు సమకూర్చేందుకు సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఓ 16 ఏళ్ల యువతి కూడా పిల్లల ఆకలి తీర్చేందుకు సాహసం చేసింది.

పిల్లల ఆకలి తీర్చేందుకు ఇంగ్లీష్ ఛానల్ ఈదిన 16 ఏళ్ల  అమ్మాయి!

నేటికాలంలో మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. తమ కోసం తప్ప ఇతరు కోసం ఆలోచించే మనుషులే కరువయ్యారు. తాము, తమ కుటుంబ సభ్యులు బాగుంటే చాలు అనుకునే వారు ఎక్కువయ్యారు. కానీ కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అని బలంగా నమ్మారు. అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటారు. పేదలకు, అనాథలకు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తుంటారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే.. సరదాగా జీవితాన్ని గడపాల్సిన వయస్సులో కొందరు యువత సమాజ సేవ చేస్తుంటారు. కొందరు అయితే పేదలకు డబ్బులు సమకూర్చేందుకు సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఓ 16 ఏళ్ల  అమ్మాయి కూడా పిల్లల ఆకలి తీర్చేందుకు సాహసం చేసింది. మరి.. ఆమె చేసిన ఆ సాహసం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

లండన్ లో భారతీయ సంతతి కి చెందిన విద్యార్థిని ప్రిషా తాప్రే(16)  తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు చిన్నతనం నుంచి పేదలకు సాయం చేయాలనే ఆలోచన ఉండేది. అందుకే తనకు అవకాశం దొరికిన ప్రతిసారి..పేదల కోసం వివిధ సేవ కార్యక్రమాలు చేసేది. ఇదే సమయంలో అదే ప్రాంతంలో చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా ఓ  స్వచ్ఛంద సంస్థ పోరాడుతుంది. ఆ సంస్థకు నిధులు సమీకరించేందుకు ప్రిషాతాప్రే అనే ఈ 16 ఏళ్ల  అమ్మాయి సాహసం చేసింది. ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఇంగ్లీష్ ఛానల్ కాలువును ప్రిషా తాప్రే ఈదారు. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కులో ఒకరిగా ప్రిషా రికార్డు సృష్టించింది.

 ప్రస్తుతం ఆమె ఉత్తర లండన్ లోని బుషే మీడ్స్ స్కూల్ లో చదువుతున్నారు.  ఈ ఇంగ్లీష్ ఛానల్ ఈదేందుకు నాలుగేళ్లుగా శిక్షణ తీసుకున్నారు. నాలుగేళ్ల అనంతరం గత వారం ఇంగ్లాండులోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్ లోని క్యాప్ గ్రిస్ నేజ్ వరకు ఈదింది. మొత్తం 34 కిలోమీటర్లను 11 గంటల 48 నిమిషాల్లో తాప్రే ఒంటరిగానే పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వ్యక్తం చేశారు. వివక్షత కారణంగా ఈత పోటీల్లో ఎక్కువ మంది అమ్మాయిలు లేరని గ్రహించానని తెలిపారు. ఇలాంటి వివక్షతను వ్యతిరేకించాలని తాను భావించినట్లు తెలిపింది. అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిలే ఏదైనా గొప్పపని చేయాలని తాను కోరుకున్నట్లు తెలిపింది. ఇంగ్లీష్ ఛానల్ ఈదడం ద్వారా తన కలం నిజమైందని తాప్రే చెప్పుకొచ్చారు. తాప్రే తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందినవారు.

ఇలా ఇంగ్లీష్ ఛానల్ ఈదడం ద్వారా 3,700పౌండ్లు అంటే మన ఇండియన్స్ కరెన్సీలో రూ.4 లక్షలు సేకరించారు. ఈ డబ్బులను భారత్ లో ప్రధాన కార్యాలయం కలిగిన అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు అందించింది. ఈ  అక్షయపాత్ర సంస్థ భారత, యూకేలలో పిల్లల్కు ఆహారం అందించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇక తాప్రే చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో పిల్లల కోసం ఆమె చేసిన సాహసం అద్భుతం అంటూ కొనియాడారు. అంతేకాక ఆడపిల్లలు ఏదైనా సాధించగలరు, చేయగలరని తాప్రే నిరూపించందన్నారు. అతి పిన్న వయస్సులో అతిపెద్ద ఛానల్ అయినా ఇంగ్లీష్ ఛానల్ ఈది యువతకు ఆదర్శం నిలిచింది. మరి.. పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రిషా తాప్రే చేసిన ఈ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.